2022 ఫస్టాఫ్ రివ్యూ4: ఫస్ట్ ఎటెంప్ట్ లోనే బెస్ట్ హిట్!
on Jun 23, 2022
2022 ఫస్టాఫ్ లో కొంతమంది తెలుగునాట తొలి ప్రయత్నాలతో సందడి చేశారు. అయితే, వారిలో కొందరు మాత్రమే విజయాలను అందిపుచ్చుకున్నారు. ఫస్ట్ ఎటెంప్ట్ లోనే బెస్ట్ హిట్ అందుకున్న వారి వివరాల్లోకి వెళితే..
విమల్ కృష్ణ:
``అట్లుంటది మనతోని`` అంటూ సిద్ధు జొన్నలగడ్డ ఎంటర్టైన్ చేసిన చిత్రం `డీజే టిల్లు`. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫిబ్రవరి 12న జనం ముందుకు వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించి.. విమల్ కృష్ణ కి శుభారంభాన్ని ఇచ్చింది.
సంయుక్తా మీనన్:
మలయాళం, తమిళ భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసిన కేరళకుట్టి సంయుక్తా మీనన్.. ఫిబ్రవరి 25న రిలీజైన `భీమ్లా నాయక్`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో.. ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించిన రానా దగ్గుబాటికి జోడీగా దర్శనమిచ్చింది సంయుక్తా మీనన్. తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినా తన అభినయంతో మెప్పించి.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలో ఈ అమ్మడు కళ్యాణ్ రామ్ `బింబిసార`తో పాటు ధనుష్ బైలింగ్వల్ మూవీ `సార్`లోనూ సందడి చేయనుంది.
ఆలియా భట్ - ఓలివియా మోరీస్:
మార్చి 25న విడుదలై పాన్ - ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన `ఆర్ ఆర్ ఆర్`తో.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ - విదేశీ సోయగం ఓలివియా మోరీస్ తొలిసారిగా తెలుగులో నేరుగా సందడి చేశారు. మొదటి ప్రయత్నంలోనే ఇక్కడ మెమరబుల్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
