పవర్ స్టార్ కి విన్నపం.. భవదీయుడు బండ్ల గణేష్
on Aug 6, 2022
బండ్ల గణేష్ ని నటుడిగా, నిర్మాతగా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఎక్కువగా గుర్తుంచుకుంటారు ప్రేక్షకులు. సినిమా వేడుకల్లో 'నా దైవం' అంటూ పవన్ గురించి ఆయన ఇచ్చే పవర్ ఫుల్ స్పీచ్ లే దానికి కారణం. అయితే తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా పవన్ కి ఒక రిక్వెస్ట్ చేశారు.
పవన్ హీరోగా బండ్ల గణేష్ 'తీన్ మార్', 'గబ్బర్ సింగ్' అనే రెండు సినిమాలను నిర్మించారు. అందులో హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని అందుకుంది. పవన్ తో ముచ్చటగా మూడో సినిమా తీయాలని బండ్ల ప్రయత్నించగా కుదరలేదు. పైగా ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న పవన్.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికే చాలా టైం పట్టేలా ఉంది. ఈ క్రమంలో తాజాగా బండ్ల చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి.
'గబ్బర్ సింగ్' స్టిల్స్ ని ట్విట్టర్ లో పంచుకున్న బండ్ల.. "నా దైవ సమానులైన మా పవన్ కళ్యాణ్.. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్" అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో "మిమ్మల్ని అర్థం చేసుకొని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే" అని రాసుకొచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
