కామెడి తీస్తే కొడతారా ?
on Apr 8, 2014

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన "హృదయ కాలేయం" ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తమ తెలంగాణా హీరోను ఒక కమెడియన్ గా చూపిస్తావా అంటూ కొంతమంది తెలంగాణావాదులు ఈ చిత్ర దర్శకుడు స్టీవెన్ శంకర్ పై దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ... "తెలంగాణా వ్యక్తిని పెట్టి కామెడి తీస్తావా అంటూ దర్శకుడిని కొట్టడం సరైన పని కాదు. ఈ సినిమా ద్వారా సంపుర్నేష్ కు మంచి పేరు వచ్చింది. అలాంటప్పుడు దర్శకుడు స్టీవెన్ శంకర్ ను అభినందించాలి కానీ.. ఇలా కొట్టడం ఎంతవరకు సమంజసం. మరోసారి ఇలా సినిమావాళ్ళ మీదకొస్తే చూస్తూ ఊరుకోం. అన్నీ రాజకీయ పార్టీలు ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం." అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



