రేసుకు ముందే మరో సినిమా
on Apr 8, 2014

అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఒకరోజు ముందుగానే తన తరువాతీ చిత్రాన్నీ ప్రారంభించబోతున్నాడు. బన్నీ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ముహూర్త కార్యక్రమాలు ఏప్రిల్ 10న లాంచనంగా ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ప్రస్తుతం బన్నీ "రేసుగుర్రం" విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, మలయాళం భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



