యండమూరి దర్శకత్వంలో సునీల్, కౌశల్ హీరోలుగా మూవీ
on Jul 24, 2021

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల 'నల్లంచు తెల్లచీర' చిత్రానికి గుమ్మడికాయ కొట్టిన యండమూరి.. తాజాగా 'అతడు ఆమె ప్రియుడు' చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు.
సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా.. మహేశ్వరి వడ్డి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు(శనివారం) పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. "మొన్న చాటింగ్.. నిన్న డేటింగ్.. ఈరోజు మేటింగ్.. రేపు....' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ తో మొదలైన ముహూర్తపు సన్నివేశానికి 'మాతృదేవోభవ' ఫేమ్ అజయ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మెగా బ్రదర్ నాగబాబు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అంబికా రాజా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
భారతదేశం గర్వించదగ్గ గొప్ప రచయితల్లో ఒకరైన యండమూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'అతడు ఆమె ప్రియుడు' అసాధారణ విజయం సాధించాలని అతిథులు నాగబాబు, కోదండరామిరెడ్డి, అజయ్ కుమార్ ఆకాంక్షించారు. యండమూరి దర్శకత్వంలో 'నల్లంచు తెల్ల చీర' అనంతరం వెంటనే 'అతడు ఆమె ప్రియుడు' చిత్రాన్ని నిర్మించే అవకాశం లభించడం పట్ల నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



