మళ్లీ ఒంటిపై 'పవన్ కల్యాణ్' టాట్టూను చూపించిన అషు
on Jul 5, 2022

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అషు రెడ్డి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. ఆమె పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఆయనపై తన ప్రేమను వ్యక్తపరిచే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోదు. తన శరీరంపై పవన్ కల్యాణ్ పేరును టాట్టూగా వేయించుకుంది. పైగా ఏ క్షణంలోనైనా దాన్ని గర్వంగా ప్రదర్శిస్తుంటుంది కూడా. రీసెంట్‌గా అషు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా మరోసారి తన శరీరంపై ఉన్న ఆ పచ్చబొట్టును చూపించి, "మీ పేరును పచ్చబొట్టుగా చేసుకొనే దాకా, టాట్టూలను నేనెప్పుడూ ఎక్కువగా ఇష్టపడేదాన్ని కాదు. <3 MyGod #pawankalyan #mybodymychoice #tattooforlife #ashureddy #fanswaitingikkada (sic)" అని రాసుకొచ్చింది. దాంతో ఒక వర్గం అభిమానులు ఆమెను అభినందిస్తూ కామెంట్లు పెడుతుంటే, ఇంకొంతమంది అది పవన్ కల్యాణ్‌ను అగౌరవపరచడమేనని విమర్శిస్తున్నారు.
పవన్ కల్యాణ్‌పై అషుకు ఉన్న ప్రేమ విషయం చాలామందికి తెలిసిందే. హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆయన బర్త్‌డేస్‌ను ఎలా జరిపేదో ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రాత్రింబవళ్లు ఆయన పోస్టర్‌కు దండం పెట్టేదని కూడా ఆమె తెలిపింది. "నేను చివరిసారి కలిసినప్పుడు ఇదే విషయం ఆయనకు చెప్పాను. నేను ఆయన్ని కలవడం అది మూడోసారి. ఆయన నన్ను గుర్తుపట్టినప్పుడు నేను పొంగిపోయాను. నన్ను సౌకర్యంగా ఉండేలా చూసిన ఆయనతో మూడు గంటల సేపు సంభాషించే అవకాశం లభించింది. మా సంభాషణ చివరలో సిగ్గులేకుండా ఆయన టీ కప్పు ఇవ్వమని అడిగాను. ఏదో ఒకరోజు పగిలిపోయే ఇలాంటి భౌతిక వస్తువులను సేకరించడం కంటే కలిసి గడిపిన అలాంటి క్షణాలను ఆస్వాదించడం మంచి విషయమని నేను గుర్తించడంలో ఆయన సాయపడ్డారు. దటీజ్ పవన్ కల్యాణ్" అని చెప్పుకొచ్చింది అషు.
అషు ప్రస్తుతం తన BFF అజయ్ కతుర్వార్‌తో కలిసి USలో ఉంది. అక్కడ ఆమె కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇటీవలి దుబాయ్ పర్యటనతో కొన్ని పర్యటన లక్ష్యాలను ఆమె నిర్దేశించుకుంది. ఆమె తాజా బోల్డ్ ఫోటోషూట్‌లు కూడా ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



