మహేష్ మేనల్లుడి రెండో సినిమా మొదలైంది!
on Feb 5, 2023

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న రెండో సినిమా ప్రారంభమైంది. గతేడాది సంక్రాంతికి 'హీరో' చిత్రంతో వెండితెరకు పరిచయమై పరవాలేదు అనిపించుకున్న అశోక్.. రెండో సినిమా చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందనున్న ఈ సినిమా నేడు(ఆదివారం) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో గల్లా, ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు దర్శకులు బోయపాటి శ్రీను, ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఈ అతనికి రెండో సినిమా. గతంలో కార్తికేయ హీరోగా 'గుణ 369' అనే సినిమా చేశాడు. ఇప్పుడు అశోక్ తో మైథలాజికల్ టచ్ ఉన్న ఫిల్మ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం పేరున్న టెక్నీషియన్స్ ని రంగంలోకి దించారు. ప్రశాంత్ వర్మ కథ అందించగా, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మూరెళ్ల వ్యవహరిస్తున్నారు. మరి రెండో సినిమాతో అశోక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



