దసరా కూడా దిల్ రాజు చేతికే!
on Feb 5, 2023

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రమైన 'దసరా'లో నటిస్తున్నారు. రగ్గ్‌డ్ లుక్ లో ఆయన ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. పక్కా మాస్ కాన్సెప్ట్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ నేచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది. బతకడం కోసం కత్తి పట్టే వాడిగా నాని పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల అవుతుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. రంగస్థలం, పుష్పల తరహాలో ఈ చిత్రం ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
దసరా హక్కులను దిల్ రాజు గట్టి పోటీ మధ్య సొంతం చేసుకోవడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే సినిమాలో దమ్ము లేనిదే ఆ చిత్రం జోలికి దిల్ రాజు వెళ్లరు. స్టార్ హీరోల చిత్రాల విషయం పక్కన పెడితే మీడియం, చిన్నతరహా చిత్రాల విషయంలో ఆయన జడ్జిమెంట్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. గత ఏడాది నిర్మాతగా కంటే డిస్ట్రిబ్యూటర్ గానే దిల్ రాజు ఎక్కువ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో దసరా థియెట్రికల్ రైట్స్ ను భారీ ధరకు పెట్టి సొంతం చేసుకున్నారు. మార్చి 30వ తేదీన సినిమా విడుదల కానుంది. దసరా విడుదల సమయంలో పోటీగా పెద్ద సినిమాలేవి లేవు. దాంతో కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో దసరా రిలీజ్ డేట్ చాలా అనుకూలంగా మారుతుంది. ఇక దిల్ రాజు ఇప్పుడు దసరా మూవీపై చాలా నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాగే నాని కెరియర్ లో మొదటిసారి చేస్తున్న డిఫరెంట్ రోల్, డిఫరెంట్ సబ్జెక్ట్ కావడం వల్ల అంచనాలు మరింతగా పెరగడానికి కారణమైంది. మరి దిల్ రాజు, నానిల నమ్మకాన్ని దసరా నిలబెడుతుందా? లేదా? అనేది వేచిచూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



