సరోగసీ నేపథ్యంలోనే స్వీటీ48...?
on Dec 29, 2022

సైన్స్ అనేది మానవాళి మంచి కోసమే వృధ్ది చెందుతోంది. నాటి భారతంలో కూడా కుంతీదేవి తన అండాలను కుండల్లో నిల్వ చేస్తుంది. ఇక సైన్స్ అనేది అభివృద్ది చెందడం, కొత్త కొత్త ఆవిష్కరణలు మంచి కోసమే అయినా వాటిని మానవులు తమ స్వార్థానికి వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటికే న్యూక్లియర్ సైన్స్‌ని బాగా దుర్వినియోగం చేస్తున్నారు. అణు ప్లాంట్ల ద్వారా శక్తిని, విద్యుత్‌ను ఎలా తయారు చేయవచ్చో అణుబాంబ్‌ల ద్వారా ప్రపంచాన్నే నాశనం చేయవచ్చు.
మంచి కోసం ఉపయోగపడాల్సిన ప్రయోగాలు దుర్వినియోగానికి వాడుకునే ప్రయత్నం మిగిల్చిన విషాదమే కరోనా కూడా. ఇక విషయానికి వస్తే సరోగసీ అనేది అద్భుతమైన ఆవిష్కరణ. అది ఎందరికో కొత్త ఊపిరి పోసింది. కానీ నేడు అది విపరీతంగా దుర్వినియోగం అవుతోంది. ఇక నేడు సినిమాల ట్రెండ్ మారిపోయింది. సమాజంలో జరిగే విషయాలను అప్డేట్ చేసుకోకపోతే ఆయా చిత్రాలు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. దాంతో నేడు ఏదైనా మూవీ తీసేటప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏమి జరుగుతోంది? అనే దానిపై కూడా ఓ దృష్టి పెట్టాలి. సమాజంలో నేడు జరుగుతున్న సంఘటనలను వాస్తవికంగా చూపించగలిగితే ఆ చిత్రాలకు రియలిస్టిక్ లుక్ తో పాటు మంచి యూనివర్సల్ టాక్ వస్తుంది.
ఇక సమంతా నటించిన యశోదా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరోగసి నేపథ్యంలోనే ఈ చిత్రం రూపొంది పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో సమంతా సరోగసి మదర్‌గా కనిపిస్తుంది. సరోగసి పేరుతో జరిగే ఒక మాఫియా ముఠా గుట్టురట్టు చేసే కథతో యశోద రూపొందింది. మొన్నటి వరకు బాలీవుడ్కే పరిమితమైన సరోగసి కాన్సెప్టు ఇప్పుడు తెలుగు తమిళ్లో హాట్ గా మారింది. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న 48వ చిత్రం కూడా సరోగసి నేపథ్యంలోనే ఉంటుందని సమాచారం. మహేష్ దర్శకత్వంలో యు వీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపించనుంది. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నారు. హీరోగా నవీన్ పోలిశెట్టి లుక్కును ఇటీవల రివీల్ చేశారు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపు పూర్తి అయ్యాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే సినిమాను వచ్చే వేసవి కానుకగా విడుదల చేస్తే ప్లాన్ లో ఉన్నారు.
అనుష్క నవీన్ పోలిశెట్టిల మధ్య వాస్తవికంగా కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉంది. మరి సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే సంబంధం ఏంటి? అసలు వీరిద్దరితో సరోగసి కాన్సెప్ట్ తో ఎలాంటి సినిమా తీస్తున్నారు? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. అనుష్క 48వ సినిమాలో ఆమె తన వయసుకు తగ్గ పాత్ర పోషిస్తుంది. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రకారం హీరో వయసు తక్కువ హీరోయిన్ వయసు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇందులో నవీన్ పోలిశెట్టి హీరో కాదు. కేవలం ఓ కీలకపాత్రనే అని సమాచారం. ఈ మూవీ అనుష్క చేస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీగానే ఉంటుందట. మొత్తానికి ఈ సినిమా అనుష్క అభిమానులు సర్ప్రైజ్ అయ్యేవిధంగా ఉంటుందని మాత్రం uv క్రియేషన్స్ వారు చెప్తున్నారు. మరి ఈ మూవీ అనుష్కకు చాలా కాలం తర్వాత ఎలాంటి హిట్నిస్తుంది? భాగమతి తర్వాత నిశ్శబ్దం నిరాశపరచిన నేపథ్యంలో ఈ చిత్రం ద్వారా ఆమె మరోసారి తన సత్తా చాటుతుందా? యువ హీరోగా కమెడియన్ గా రాణిస్తున్న నవీన్ పోలిశెట్టికి ఈ మూవీ ఎలాంటి బ్రేక్ ని ఇవ్వబోతుంది? అనేవి చూడాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



