బోల్డ్ రోల్‌లో హద్దు దాటిన అనుపమ
on Jan 20, 2021

ఇన్నాళ్ళు పద్ధతిగా ఉండే పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. తొలిసారి కాస్త హద్దు దాటి బోల్డ్ రోల్ లో దర్శనమిచ్చింది. అయితే అదేదో సినిమా కోసమో, వెబ్ సిరీస్ కోసమో కాదు. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం. 29 నిమిషాల నిడివి ఉన్న ఆ లఘు చిత్రం పేరు.. ఫ్రీడమ్ @ మిడ్ నైట్. రెండే రెండు పాత్రలతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ.. ఆరేళ్ళ పాపకు తల్లిగా గృహిణి పాత్రలో కనిపించింది.
ఛాట్ విండోస్, వర్చువల్ హ్యాపీ నెస్, సెక్స్ విత్ స్ట్రేంజర్.. ఇలాంటి వాటికి అలవాటు పడ్డ భర్తని ప్రశ్నిస్తూ.. తనకూ అలాంటి వాటిని కోరుకునే ఫ్రీడమ్ కావాలంటూ అడిగే చంద్ర పాత్రలో నటించింది అనుపమ. షార్ట్ ఫిల్మ్ మొత్తం చీరకట్టులోనే కనిపించినా.. అక్కడక్కడ 'F*' పదాలతో షాక్ ఇచ్చింది. ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనూ అస్సలు తగ్గలేదు. భర్తలకు కనువిప్పు కలిగించేలా తెరకెక్కిన ఈ లఘుచిత్రాన్ని తన అభినయంతో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. నటిగా అదరగొట్టిందనే మార్కులు దక్కించుకుంది. తెలుగు, మలయాళ భాషల్లో యూట్యూబ్ ముంగిట అందుబాటులో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ తో.. అనుపమ దశ, దిశ మారిపోతాయేమో చూడాలి.
ప్రస్తుతం అనుపమ.. నిఖిల్ హీరోగా నటిస్తున్న 18 పేజెస్ లో నటిస్తోంది. కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



