అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య
on Jul 28, 2018

అమ్మగా, బామ్మగా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అన్నపూర్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.. అన్నపూర్ణకి పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకున్నారు.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం వివాహమైంది.. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని కృష్ణా బ్లాక్‌లో కీర్తి నివాసం ఉంటున్నారు.. బెంగళూరులో ఉన్న వెంకటకృష్ణ తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వచ్చారు.. ఆ సమయంలో కీర్తి నిద్రపోతుండటంతో ఆయన వేరే గదిలో పడుకొన్నారు.. ఉదయం నిద్ర లేచేసరికి కీర్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు ఆయన పేర్కొన్నారు.. వెంటనే పక్కనే గోదావరి బ్లాక్‌లో నివాసం ఉంటున్న అన్నపూర్ణకు సమాచారం ఇచ్చి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే కీర్తి ఆత్మహత్యకు ఆరోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



