ప్లీజ్... రెహమాన్‌తో కంపేర్ చేయకండి
on Feb 27, 2019
"ప్లీజ్... నన్ను రెహమాన్‌తో, నా మ్యూజిక్‌ని రెహమాన్ మ్యూజిక్‌తో కంపేర్ చేయకండి" అని యువ తమిళ సంగీత సంచలనం, 'కొలవెరి డి' ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే... లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఇండియన్ 2'. తెలుగులో 'భారతీయుడు'గా విడుదలైన 'ఇండియన్'కి సీక్వెల్ ఇది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. 'భారతీయుడు' సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. అందువల్ల, సీక్వెల్ మ్యూజిక్ విషయంలో కంపేరిజన్స్ రావడం సహజమని, రెహమాన్‌తో తనను, రెహమాన్‌తో తన మ్యూజిక్‌ని కంపేర్ చేయవద్దని అనిరుధ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. 'ఇండియన్ 2'కి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కాదని తెలిశాక ఎంతోమంది అభిమానులు అప్సెట్ అయినా విషయం గురించీ అనిరుధ్ స్పందించాడు. "నేను కాకుండా రెహమాన్ స్థానంలో మరొకరు 'ఇండియన్ 2' మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిస్తే... నేనూ ఫీల్ అవుతా. అయితే నాకొక అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా" అని ఈ యువ సంగీత దర్శకుడు చెప్పాడు. రెహమాన్ బదులు తనను ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారని శంకర్ సార్‌ని క్వశ్చన్ చేయలేదని అనిరుధ్ రవిచంద్రన్ అన్నాడు. ఒకవేళ అడిగి ఉంటే తమ మధ్య ఈక్వీషన్ డిస్టర్బ్ అవుతుందని అన్నాడు. ప్రస్తుతం తమిళంలో 'ఇండియన్ 2'తో పాటు రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు, తెలుగులో నాని 'జెర్సీ'కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.