Home

»

Latest News

అనిల్ రావిపూడి.. మ‌రో స‌మ్మ‌ర్ హిట్ క్రెడిట్ అయ్యేనా!?

Jan 24, 2022 11:42AM

తెలుగునాట వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి ఒక‌రు. `ప‌టాస్` (2015) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో కెరీర్ ని ఆరంభించిన అనిల్.. ఆపై `సుప్రీమ్` (2016), `రాజా ది గ్రేట్` (2017), `ఎఫ్ 2` (2019), `స‌రిలేరు నీకెవ్వ‌రు` (2020)తో త‌న విజ‌యప‌రంప‌ర‌ని కొన‌సాగించాడు. సినిమా సినిమాకి ద‌ర్శ‌కుడిగా త‌న స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ `ఎఫ్ 3` చిత్రంతో బిజీగా ఉన్నాడు. త‌న కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒక‌టైన `ఎఫ్ 2`కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. `ఎఫ్ 2`లో న‌టించిన విక్ట‌రీ వెంక‌టేశ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ్రీన్.. `ఎఫ్ 3`లోనూ కొన‌సాగుతున్నారు. `ఎఫ్ 2`కి స్వ‌రాలందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ సీక్వెల్ కి కూడా బాణీలందిస్తున్నారు. `దిల్` రాజునే ఈ సీక్వెల్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also read: అప్పుడు `మిస్ట‌ర్`.. ఇప్పుడు `ఎఫ్ 3`..!

కాగా, వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న `ఎఫ్ 3` థియేట‌ర్స్ లోకి రాబోతోంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. అనిల్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు స‌మ్మ‌ర్ సీజ‌న్ లో ఒకే ఒక చిత్రం రిలీజైంది. అదే.. `సుప్రీమ్`. 2016 మే 5న విడుద‌లైన ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. మ‌రి.. `ఎఫ్ 3` కూడా వేస‌విలో ప‌సందైన‌ వినోదాలు పంచి అనిల్ ఖాతాలో మ‌రో సమ్మ‌ర్ హిట్ గా క్రెడిట్ అవుతుందేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com