Home

»

Latest News

తగ్గేదేలే అంటున్న నాని.. 'అంటే సుందరానికీ' షూటింగ్ పూర్తి

Jan 24, 2022 12:04PM

నేచురల్  స్టార్ నాని  హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే  సుందరానికీ..`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని తాజాగా అంటే సుందరానికి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నాని.  "ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం అంటే సుందరానికి షూటింగ్ పూర్తయింది. `` అని ప్రకటించిన నాని.. సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేశాడు.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో  `కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్` అనేది నాని పాత్ర పేరు. నూతన సంవత్సరం సందర్భంగా  విడుద‌లైన `అంటే సుందరానికీ..` ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆకట్టుకున్నాడు.

అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com