Home

»

Latest News

అప్పుడు `మిస్ట‌ర్`.. ఇప్పుడు `ఎఫ్ 3`..!

Jan 21, 2022 1:53PM

`ఫిదా`, `తొలిప్రేమ‌`, `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగునాట త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతిలో `గ‌ని`, `ఎఫ్ 3` చిత్రాలున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన `గ‌ని` మార్చి 18న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్టైనర్ `ఎఫ్ 3` వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇదిలా ఉంటే.. వ‌రుణ్ తేజ్ కెరీర్ ని ప‌రిశీలిస్తే ఇప్ప‌టివ‌ర‌కు త‌న ఖాతాలో ఉన్న విజ‌యాల‌న్నీ నాన్ - స‌మ్మ‌ర్ రిలీజ్ మూవీస్ తోనే ద‌క్కాయి. వేస‌విలో ఇంత‌కుముందు వ‌రుణ్ నుంచి ఒకే ఒక్క చిత్రం రాగా.. అది డిజాస్ట‌ర్ అయింది. ఆ సినిమానే.. `మిస్ట‌ర్`. స్టార్ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల రూపొందించిన ఈ రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామా 2017 ఏప్రిల్ 14న జ‌నం ముందు నిలిచింది. క‌ట్ చేస్తే.. ఐదేళ్ళ త‌రువాత ఇప్పుడు అదే ఏప్రిల్ నెల‌లో `ఎఫ్ 3` రాబోతోంది. మ‌రి.. త‌న కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజ‌ప్పాయింట్ మూవీగా నిలిచిన `మిస్ట‌ర్` విడుద‌లైన నెల‌లోనే రాబోతున్న `ఎఫ్ 3`.. వ‌రుణ్ కి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: మెగాస్టార్ ఏప్రిల్ హిట్స్ లో `ఆచార్య‌` చేరుతుందా!?

కాగా, వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న `ఎఫ్ 3`లో సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు వ‌రుణ్ తేజ్. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com