అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఉన్న ముగ్గురు హీరోయిన్లు వీళ్లేనా!
on Apr 26, 2025

ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)తన ఇరవై రెండవ చిత్రాన్ని తమిళ దర్శకుడు 'అట్లీ'(Atlee)తో చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ బర్త్ డే రోజు ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించేటప్పుడు చిత్ర బృందం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోతో ఈ చిత్రం ఏ స్థాయిలో నిర్మాణం జరుపుకోబోతుందో అర్థమైపోయింది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్ర కథ ఉండబోతోందనే ప్రచారం కూడా ఉంది.
ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లుకి చోటు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందు కోసం మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)దీపికా పదుకునే(Deepika Padukune) జాన్వీ కపూర్(Janhvi Kapoor)పేర్లు చిత్ర యూనిట్ పరిశీలిస్తుందనే వార్తలు వినపడుతున్నాయి. రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ క్యారక్టర్ కి సంబంధించిన లుక్ టెస్ట్ జరిగిందని, చిత్ర బృందం ఆమె విషయంలో సంతృప్తిగా ఉండటంతో త్వరలోనే ఆమె పేరుని అధికారకంగా ప్రకటిస్తారని అంటున్నారు. జాన్వీకపూర్, దీపికా పదుకునే తో కూడా యూనిట్ సంప్రదింపులు జరిపారని,త్వరలోనే వాళ్లిదరు కూడా లుక్ టెస్ట్ లో పాల్గొనబోతున్నారనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ తో ఈ ముగ్గురు హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయమైతే, కాస్టింగ్ పరంగా ఈ మూవీ సంచలనాన్ని సృష్టించినట్టే. ఈ ముగ్గురు హీరోయిన్లు తమ ప్రీవియస్ చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించారు. ఎన్టీఆర్ తో చేసిన దేవరతో జాన్వీ హిట్ ని అందుకొని, ఇప్పుడు రామ్ చరణ్ తో'పెద్ది' చేస్తుంది. దీపికా పదుకునే ప్రభాస్ కల్కితో భారీ విజయాన్ని అందుకోగా, మృణాల్ ఠాకూర్ సీతారామం, హాయ్ నాన్న తో క్రేజీ హీరోయిన్ గా మారింది. దీంతో అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఎంటైర్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పై అగ్ర నిర్మాత కళానిధి మారన్(Kalanithi Maran)నిర్మిస్తున్నాడు. నటీనటుల పూర్తి వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. జులై చివరి వారం లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో షూట్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



