సింగిల్ మూవీ లాభాల్లో మన సైనికులకు భాగం.. అల్లు అరవింద్ కీలక ప్రకటన!
on May 9, 2025

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా.. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసి, పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. దీంతో మన సైన్యం పాక్ కి సరైన సమాధానం చెబుతోంది. ఈ క్రమంలో కొందరు వీరులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దీంతో మన సైనికులకు, సైనిక కుటుంబాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైతం సైనికులకు తన వంతు మద్దతు తెలపడానికి ముందుకు అడుగువేశారు.
అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ నిర్మించిన 'సింగిల్' మూవీ నేడు(మే 9) థియేటర్లలో అడుగుపెట్టింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించనున్నామని ప్రకటించారు. మన సైనికులకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అల్లు అరవింద్ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



