మనవాళ్ళు చేస్తుంది యుద్ధం కిందకి రాదు..నిన్ను అభిమానించినందుకు భలే చెప్పావు
on May 9, 2025

పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు 'పహల్ గామ్'(Pakisthan)లో చేసిన దాడికి ప్రతీకారంగా మన సైనికులు 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)ని నిర్వహించి దెబ్బకి దెబ్బ తీసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన ఎంతో మంది నటీనటులు 'ఆపరేషన్ సిందూర్' కి మద్దతుగా నిలుస్తున్నారు. యుద్ధం చేసి ఉగ్రవాదులని అంతం చెయ్యాలని కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో చేసిన పాకిస్థాన్ కి చెందిన యాక్టర్స్ ''ఆపరేషన్ సిందూర్ పై విమర్శనాస్త్రాలు గుప్పించడంతో వాళ్ళని బ్యాన్ చేయడం ఖాయమయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో జరుగుతున్న పరిమాణాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు కుట్రపూరితంగా జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందుకు మన వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడమనేది బాధ్యత అవుతుంది తప్ప అవకాశం కాదు. ఉగ్రవాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే పోరాటం యుద్ధం కిందకి రాదు. ఈ పోరాటానికి మద్దతు ఇచ్చే వారిని యుద్ధం కోరుకునే వారిలా చూడవద్దు. వాళ్లంతా దేశభద్రత, న్యాయం కోసం పోరాటపడే వాళ్ళు. దూకుడు ధోరణి, అత్యవసర ఆత్మరక్షణకి మధ్య చాలా తేడా ఉంటుంది. శాంతిని కోరుకోవడం అంటే జరిగిన హింసని మౌనంగా అంగీకరించడం కాదు. మనకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడం. కాబట్టి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ప్రశ్నించండని తన పోస్ట్ లో పేర్కొంది.
కన్నడ చిత్ర సీమకి చెందిన రష్మిక 'ఛలో' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే వరుస విజయాల్ని అందుకొని పుష్ప, పుష్ప 2(Pushpa 2),యానిమల్, చావా వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందింది. తెలుగు తమిళ హిందీ కన్నడ లో కలిపి ఇప్పటి వరకు 22 చిత్రాల దాకా చెయ్యగా కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



