అఖిల్ సినిమా డేట్ ఫిక్స్ చేశారు
on Oct 21, 2014
.jpg)
అక్కినేని అఖిల్ తొలి చిత్రాన్ని టాప్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం. తాజాగా, అక్కినేని అఖిల్ లాంచింగ్ కార్యక్రమం అతి త్వరలో గ్రాండ్ గా జరగనుందని తెలుస్తోంది. అక్కినేని అఖిల్ తొలి సినిమా ప్రారంభోత్సవం తెలుగు సినీ రంగ ప్రముఖల సమక్షంలో అంగరంగవైభవంగా నవంబర్ రెండో వారంలో జరగనుందని అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు అంటున్నాయి. మూవీ స్క్రిప్ట్‌లో నాగార్జున సూచించిన మార్పులన్నీ చేశాక ఇక వినాయక్ రంగంలోకి దిగబోతున్నాడట. ‘ మనం’ మూవీలో క్లైమాక్స్ లో అలరించిన అఖిల్, రీసెంట్ గా టైటాన్ యాడ్ లో కూడా మెరిసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



