అఖిల్ 5కి ముహూర్తం ఫిక్స్ అయినట్టే...
on Nov 24, 2020

'మిస్టర్ మజ్ను'గా 'హలో' చెప్పిన 'అఖిల్' కి.. తొలి మూడు ప్రయత్నాల్లో నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో.. నాలుగో చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' పైనే ఆశలు పెట్టుకున్నాడీ అక్కినేని బుల్లోడు. ఈ సినిమా ముగింపు దశలో ఉన్నప్పుడే స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీని సెట్ చేసుకున్నాడీ ఒకనాటి 'సిసింద్రీ'. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు.
కాగా, ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని జనవరి చివరి వారంలో ప్రారంభించాలని సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ వెంచర్ లో అఖిల్ కి జోడీగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.
మరి.. అఖిల్, సూరి ఫస్ట్ కాంబో ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



