అఖండ 2 లో ప్రధాన హైలెట్స్ ఇవే.. అందుకే ఇంకోసారి చూస్తామంటున్నారు
on Dec 12, 2025

-అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు!
-పాజిటివ్ టాక్
-ఆ హైలెట్ సీన్స్ లో పర్పస్ ఏంటి!
ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ మొత్తం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)'అఖండ 2'(Akhanda 2)తో చేస్తున్న రుద్రతాండవంతో ఊగిపోతున్నాయి. నైట్ ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ రావడంతో థియేటర్స్ అన్నిహెవీ క్రౌడ్ తో రన్ అవుతున్నాయి. మూవీ చేసిన అభిమానులు,ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మూవీలోని కొన్ని సీన్స్ చాల బాగున్నాయి. సదరు సన్నివేశాలు మూవీ మొత్తానికే హైలెట్ కావడంతో పాటు గూస్ బంప్స్ కూడా వచ్చాయి. ఆ అనుభూతి కోసం ఇంకోసారి మూవీకి వెళ్తామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న సీన్స్ ఏంటో చూద్దాం.
శివుడ్ని మరింతగా ప్రసన్నం చేసుకోవడానికి అఖండ కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండి ఆపదలో ఉన్న జనని దగ్గరకి వెళ్లి శత్రువులతో పోరాడే సన్నివేశం. పరమేశ్వరుడు అఖండ రూపంలో వెళ్ళి అఖండ తల్లి దహన సంస్కారాలు చేయడం. ఈ సందర్భంగా అఖండ తల్లి ఆత్మ, శివుడి మధ్య జరిగే మాటలు. కుంభమేళా సీన్స్, ఆది పినిశెట్టి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అఖండ, ఆది పినిశెట్టి పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్, గుడి గురించి, హైందవ ధర్మం గురించి బాలకృష్ణ చెప్పే మాటలు, క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ,బాలయ్య, శివుడు తమ తమ ప్రదేశాల్లో ఒకే సారి తాండవం చేసే సన్నివేశం. విఎఫ్ఎక్స్ వర్క్, అఖండ యాక్షన్ ఎపిసోడ్స్ కి థమన్ ఇచ్చిన బిజిఎం. అఖండ గా బాలయ్య నటన ప్రధాన హైలెట్ గా నిలిచాయని అంటున్నారు.
also read: అఖండ 2 మూవీ రివ్యూ
ఇక ఎక్కువ శాతం రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో ఇప్పుడు అఖండ 2 సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



