రజినీకాంత్‌కు ఐశ్వర్యా రాయ్ పాదాభివందనం!
on Sep 8, 2022

కల్కి కృష్ణమూర్తి నవల "పొన్నియన్ సెల్వన్" ఆధారంగా తెరకెక్కిన చిత్రం "పొన్నియన్ సెల్వన్". మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో జయం రవి, ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, చియాన్ విక్రమ్, కార్తిక్ శివకుమార్, జయం రవి, త్రిష , ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 30న తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు కన్నడ లో కూడా రిలీజ్ కాబోతుంది.
ఇటీవల జరిగిన "పొన్నియన్ సెల్వన్" మూవీ ట్రైలర్ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ ని చూడగానే ఐశ్వర్యరాయ్ గౌరవంతో ఆయన పాదాలకు నమస్కారం చేసింది. రజనీకాంత్ వెంటనే ఆమెను దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. ఆ తర్వాత ఇరువురూ నమస్కారం చేసుకున్నారు. రజనీకాంత్ పట్ల ఐశ్వర్యరాయ్ చూపిన అభిమానానికి, గౌరవానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా చేసినందుకు అభిమానులు సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ ని తెగ ప్రశంసిస్తున్నారు. ఒక అభిమాని ఐతే ఏకంగా ' You stole my heart ' అని ట్వీట్ చేసాడు.
రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ కలిసి గతంలో 'రోబో' సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఆమెకు రజినీకాంత్ అంటే ప్రత్యేకమైన అభిమానం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



