'ఆదిపురుష్' టీజర్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!
on Sep 27, 2022

ప్రస్తుతం ఇండియాలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమాలలో 'ఆదిపురుష్' ఒకటి. ఈ సినిమా కోసం కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ మూవీ టీజర్ కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది.
'ఆదిపురుష్' అప్డేట్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఇంతవరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడంపై సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ని ఫ్యాన్స్ తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ కాదు ఏకంగా టీజరే రాబోతుందన్న న్యూస్ తో వాళ్ళు సంబరపడిపోతున్నారు. అక్టోబర్ 2న అయోధ్యలో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ని లాంచ్ చేయబోతున్నారట. మూవీ టీమ్ తో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరగనుందని తెలుస్తోంది.
టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనుండగా సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



