మంచు విష్ణు ప్యానల్ కు నరేష్ మద్దతు.. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్!
on Sep 23, 2021
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల బరిలో ఉన్న మంచు విష్ణు ప్యానల్ కు ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్ మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విష్ణు ప్యానల్ విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
'మా కోసం మనమందరం' పేరుతో గురువారం మంచు విష్ణు తన ప్యానల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబూమోహన్, వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, పృథ్వీరాజ్, ట్రెజరర్ గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు బరిలో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అర్చన, గీతా సింగ్, సంపూర్ణేష్ బాబు, శ్రీలక్ష్మితో పాటు పలువురు పోటీ పడుతున్నారు.
తాజాగా మంచు విష్ణు ప్యానల్ పై నరేష్ స్పందించారు. మంచు విష్ణు ప్యానల్ ఫ్రెష్‌గా, పాజిటివ్‌గా ఉందని.. వివాదాస్పద వ్యక్తులెవరూ లేరని అన్నారు. విష్ణు ప్యానల్ లో అందరూ చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారని.. ముఖ్యంగా ప్యానల్లో 10 మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మేనిఫెస్టో కూడా ఇంతే బాగుండాలి అని తాను కోరుకుంటున్నానని చెప్పిన నరేష్.. విష్ణుకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు.
Also Read