దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'ఏటీఎం' వెబ్ సిరీస్!
on Jan 27, 2022

దిల్ రాజు ప్రొడక్షన్స్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రానుంది. 'ఏటీఎం' పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ కి హరీష్ శంకర్ కథ అందించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
'ఏటీఎం' వెబ్ సిరీస్ కోసం దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ5 చేతులు కలిపాయి. శిరీష్ సమర్పణలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కి చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. హైదరాబాద్ లో ఓ భారీ దొంగతనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, హరీష్ శంకర్ నిర్మాతలు. ఈ సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

'శర్వానంద్ హీరోగా నటించిన 'రాధ' సినిమాతో చంద్ర మోహన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆయన సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి కూడా హరీష్ శంకరే కథ అందించడం విశేషం. ఇప్పుడు హరీష్ శంకర్ కథతో ఏటీఎం వెబ్ సిరీస్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు చంద్ర మోహన్. ఈ సిరీస్ కి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



