గెస్ట్ రోల్లో రెహమాన్!!
on Aug 5, 2019
సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఎ.ఆర్ . రెహమాన్. ఈ మ్యూజిక్ జీనియస్ ఇప్పటి వరకు తన పాటలతో హుషారెత్తించారు. ఇక పై స్క్రీన్ పై కూడా మెరవబోతున్నట్లు తెలుస్తోంది. అవును తమిళ స్టార్ విజయ్ హీరోగా నటిస్తుండగా అట్లీ దర్శకత్వం వహిస్తోన్న `బిగిల్` అనే తమిళ సినిమాలో రెహమాన్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాకు ఆయనే స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఇందులో సింగపెన్నే` అంటూ సాగే పాటలో గెస్ట్ గా కాసేపు కనిపించబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ పూర్తైంది. త్వరలో ఈ పాటను పిక్చరైజ్ చేయనున్నారట. ఇక అడపా దడపా ప్రైవేట్ ఆల్బమ్స్ లో కనిపించి అభిమానులను మెప్పించిన రెహమాన్ త్వరలో వెండి తెరపై కనువిందు చేయబోతున్నారన్నమాట. దివాళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.