తెలుగు సూపర్ హీరో ఫిల్మ్.. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు!
on Aug 6, 2023
తెలుగులో సూపర్ హీరో తరహా చిత్రాలు తక్కువే. ఒకవేళ సూపర్ హీరో సినిమాలు చేయలన్నా స్టార్లకే సాధ్యం అనుకుంటాం. అలాంటిది ఓ యంగ్ టీం తెలుగులో సూపర్ హీరో సినిమా చేస్తోంది. అదే 'ఏ మాస్టర్ పీస్'. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. 'శుక్ర', 'మాట రాని మౌనమిది' సినిమాలతో ప్రతిభగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుకు పూర్వజ్ డైరెక్షన్ లో సినిమా బండి బ్యానర్ పై శ్రీకాంత్ కండ్రాగుల నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
'ఏ మాస్టర్ పీస్' సినిమా నుంచి తాజాగా సూపర్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మనీష్ గిలాడా ఈ సూపర్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో విలన్ డేట్ ఆఫ్ బర్త్ మూడుసార్లు, డేట్ ఆఫ్ డెత్ రెండు సార్లు రాయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1960లో పుట్టి 1986లో చనిపోయిన ఈ సూపర్ విలన్ మళ్లీ 1986లో పుట్టి 2010లో మరణిస్తాడు. తిరిగి 2010 లో పుట్టి ఎప్పుడు కన్నుమూస్తాడు అనే ప్రశ్నార్థకంతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
అషు రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ గుప్తా, జ్యోతిరాయ్, అర్చనా అనంత్, జయ ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆశీర్వాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా శివరామ్ చరణ్, ఎడిటర్ గా మనోజ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
