`ఊహలు గుసగుసలాడే`కి ఎనిమిదేళ్ళు!
on Jun 20, 2022

అవసరాల శ్రీనివాస్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి దర్శకుడు కూడా. `ఊహలు గుసగుసలాడే` పేరుతో ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా.. విజయపథంలో పయనించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించగా.. ఇదే మూవీతో రాశీ ఖన్నా తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అవసరాల శ్రీనివాస్ మరో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రభావతి (రాశి), వెంకీ (నాగ శౌర్య), ఉదయ్ (అవసరాల) అనే మూడు పాత్రల చుట్టూ తిరిగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమే.. `ఊహలు గుసగుసలాడే`. ఇందులో రావు రమేశ్, సూర్య, హేమ, ప్రగతి, సత్యకృష్ణన్, పోసాని కృష్ణమురళి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
కళ్యాణి మాలిక్ సంగీతమందించిన ఈ చిత్రానికి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, అనంత శ్రీరామ్ సాహిత్యమందించారు. పాటల్లో ``ఏం సందేహం లేదు`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``ఏమిటి హడావిడి``, ``ఇంతకంటే వేరే`` (రెండు వెర్షన్స్) కూడా రంజింపజేశాయి. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజిని కొర్రపాటి నిర్మించిన `ఊహలు గుసగుసలాడే`.. 2014 జూన్ 20న విడుదలై జననీరాజనాలు అందుకుంది. కాగా, నేటితో ఈ చిత్రం 8 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



