ENGLISH | TELUGU  

సంక్రాంతి సినిమాల విడుదల తేదీలు ఖరారు!

on Nov 30, 2022

తెలుగులో 2023 సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండనుంది. తెలుగు నుంచి రెండు పెద్ద సినిమాలతో పాటు, తమిళ్ నుంచి రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ సంక్రాంతి సినిమాల విడుదల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, విడుదల తేదీలు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది.

ముందుగా జనవరి 11న తమిళ్ మూవీ 'తునివు' విడుదల కానుందని సమాచారం. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై తమిళ్ లో భారీ అంచనాలు ఉన్నాయి కానీ తెలుగులో అసలు బజ్ లేదు. విడుదల సమయానికి ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికైతే ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల దృష్టి పడలేదు.

జనవరి 12న 'వీర సింహ రెడ్డి', 'వారిసు'('వారసుడు') సినిమాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం కావడంతో 'వీర సింహ రెడ్డి'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆ అంచనాలను పెంచేశాయి. పైగా సంక్రాంతికి వచ్చి 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' వంటి ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న ట్రాక్ రికార్డు బాలయ్యకు ఉంది. దీంతో 'వీర సింహ రెడ్డి'కి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. అదే సమయంలో ఈ మూవీ ఓపెనింగ్స్ పై 'వారసుడు' ఎంతోకొంత ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. తమిళ్ స్టార్ విజయ్ కి ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ పెరుగుతోంది. పైగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతుంది అనడంలో సందేహం లేదు. మరి 'వీర సింహ రెడ్డి' ఓపెనింగ్స్ కి 'వారసుడు' ఏ స్థాయిలో గండి కొడుతుందో చూడాలి.

ఇక జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' రానుందని టాక్. దసరాకు 'గాడ్ ఫాదర్'తో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, సాంగ్ మెప్పించాయి. వింటేజ్ మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి మెగా ఓపెనింగ్స్ వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అప్పటికే 'వీర సింహ రెడ్డి', 'వారసుడు' సినిమాలు భారీ సంఖ్యలో థియేటర్లను ఆక్రమించి ఉండటం.. 'వాల్తేరు వీరయ్య' ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం చూపే అవకాశముంది. ఏది ఏమైనా ఈ సంక్రాంతి పోరు ప్రధానంగా 'వీర సింహ రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' మధ్య ఉండనుంది. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.