ENGLISH | TELUGU  

2021 జ్ఞాప‌కాలుః యువ క‌థానాయిక‌ల జోరు.. తెలుగమ్మాయిలదే హ‌వా!

on Dec 31, 2021

2021లో కొంత‌మంది యువ క‌థానాయిక‌లు జోరు చూపించారు. మ‌రీముఖ్యంగా.. తెలుగమ్మాయిల సంద‌డి ఈ ఏడాది బాగా క‌నిపించింది. అయితే, వీరిలో కొంద‌రికి మాత్ర‌మే మంచి విజ‌యాలు ద‌క్కాయి. ఆ యంగ్ బ్యూటీస్ వివ‌రాల్లోకి వెళితే..

రీతూ వ‌ర్మః- `పెళ్ళి చూపులు`తో తెలుగునాట న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన టాలెంటెడ్ బ్యూటీ రీతూ వ‌ర్మ‌.. ఈ ఏడాది `నిన్నిలా నిన్నిలా`, `ట‌క్ జ‌గ‌దీశ్`, `వ‌రుడు కావలెను` చిత్రాల‌తో సంద‌డి చేసింది. ఈ మూడు సినిమాలు కూడా ఈ తెలుగ‌మ్మాయికి ఆశించిన ఫ‌లితాలు అందించ‌క‌పోయినా.. న‌టిగా మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి.

ఐశ్వ‌ర్యా రాజేశ్ః- టాలెంటెడ్ యాక్ట్ర‌స్ ఐశ్వ‌ర్యా రాజేశ్.. 2021లో `ట‌క్ జ‌గ‌దీశ్` (అమెజాన్ ప్రైమ్), `రిప‌బ్లిక్` సినిమాల్లో అల‌రించే ప్ర‌య‌త్నం చేసింది.

ఆనందిః- తెలుగమ్మాయి ఆనంది ఈ ఏడాది `జాంబి రెడ్డి`, `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్` చిత్రాల్లో అభినయానికి ఆస్కార‌మున్న పాత్ర‌ల్లో ఆక‌ట్టుకుంది.

ప్రియాంక జ‌వాల్క‌ర్ః- `తిమ్మ‌రుసు`, `ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం`, `గ‌మ‌నం`.. ఇలా ఈ ఏడాది ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో ప‌ల‌క‌రించింది తెలుగమ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్. వీటిలో తొలి రెండు సినిమాలు మంచి ఫ‌లితాన్ని అందించాయి.

అన‌న్య నాగ‌ళ్ళః- తెలుగమ్మాయి అన‌న్య నాగ‌ళ్ళ ఈ ఏడాది `వ‌కీల్ సాబ్`, `ప్లే బ్యాక్` చిత్రాల్లో న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో ఆక‌ట్టుకుంది.

ఈషా రెబ్బాః- తెలుగమ్మాయి ఈషా రెబ్బా `పిట్ట‌కథ‌లు` (ఆంథాల‌జీ), `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` (గెస్ట్), `త్రీ రోజెస్` (వెబ్ - సిరీస్)తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

న‌భా న‌టేశ్ః- `ఇస్మార్ట్` బ్యూటీ న‌భా న‌టేశ్ ఈ ఏడాది `అల్లుడు అదుర్స్`, `మాస్ట్రో` (డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్) చిత్రాల‌తో ప‌ల‌క‌రించింది. ఈ రెండు సినిమాలు కూడా న‌భా కెరీర్ కి అంత‌గా ప్ల‌స్ కాలేక‌పోయాయి.

అను ఇమ్మాన్యుయేల్ః- ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో `అల్లుడు అదుర్స్`, `మ‌హా సముద్రం` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన అను ఇమ్మాన్యుయేల్ కి.. ఈ రెండు సినిమాలు ఏ ర‌కంగానూ ప్ల‌స్ కాలేక‌పోయాయి.

దిగంగ‌న సూర్య‌వంశీః- `హిప్పీ` భామ దిగంగ‌న సూర్య‌వంశీ.. ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో `సీటీమార్`లో సెకండ్ లీడ్ గా క‌నిపించింది. త‌న కెరీర్ లో ఫ‌స్ట్ స‌క్సెస్ చూసింది.

నివేదా పెతురాజ్ః- టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్.. 2021లో `రెడ్`, `పాగ‌ల్` సినిమాల‌తో ఎంట‌ర్టైన్ చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఓకే అనిపించుకున్నాయి.

మ‌డోన్నా సెబాస్టెయిన్ః- `ప్రేమమ్` బ్యూటీ మ‌డోన్నా సెబాస్టెయిన్ ఈ ఏడాది `శ్యామ్ సింగ రాయ్`లో ఓ ముఖ్య పాత్ర‌లో అల‌రించింది.

మెహ్రీన్ః- స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ్రీన్.. ఈ ఏడాది `మంచి రోజులు వ‌చ్చాయి`తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. త‌న న‌ట‌న‌తో ఇంప్రెస్ చేసింది.

రుహానీ శ‌ర్మః- హ్యాట్రిక్ హీరోయిన్ రుహానీ శ‌ర్మ ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో `నూటొక్క జిల్లాల అంద‌గాడు`తో విష్ చేసింది. అయితే, ఈ సారి మాత్రం హిట్ కొట్టలేక‌పోయింది.

నందితా శ్వేతః- టాలెంటెడ్ యాక్ట్ర‌స్ నందితా శ్వేత‌.. ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో `అక్ష‌ర‌`, `క‌ప‌ట‌ధారి` చిత్రాల‌తో ప‌ల‌క‌రించింది. అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో అల‌రించింది.

ప్రియాంక అరుళ్ మోహ‌న్ః- `గ్యాంగ్ లీడ‌ర్` ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహ‌న్.. ఈ ఏడాది `శ్రీ‌కారం`తో సంద‌డి చేసింది. మ‌రోసారి నిరాశాజ‌న‌క ఫ‌లిత‌మే ద‌క్కినా.. అనువాద చిత్రం  `వ‌రుణ్ డాక్ట‌ర్`తో హిట్ కొట్టింది.

మేఘా ఆకాశ్ః- ఈ సంవ‌త్స‌రం `రాజ రాజ చోర‌`, `డియ‌ర్ మేఘ‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన మేఘా ఆకాశ్ కి.. `రాజ రాజ చోర‌`తో ఫ‌స్ట్ స‌క్సెస్ ద‌క్కింది.

అవికా గోర్ః- టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్ ఈ ఏడాది ఓటీటీ మూవీస్ `నెట్`, `#బ్రో` చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది.

వీరితో పాటు సుర‌భి (శ‌శి), నేహా శెట్టి (గ‌ల్లీ రౌడీ) వంటి యంగ్ బ్యూటీస్ కూడా 2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో సంద‌డి చేశారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.