Home

»

Latest News

'శ్యామ్ సింగ రాయ్‌'కి ఫ‌స్ట్ వీక్ వ‌చ్చిందిదే.. వీక్ డేస్‌లో ప‌డిపోయిన క‌లెక్ష‌న్లు!

Dec 31, 2021

 

నాని డ్యూయ‌ల్ రోల్ చేసిన 'శ్యామ్ సింగ రాయ్' ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ, రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలివారం ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్త వ‌సూళ్లు రూ. 20 కోట్ల (షేర్‌)ను దాటాయి. టైటిల్ రోల్ నాని, అత‌ని భార్య రోజీగా సాయిప‌ల్ల‌వి ప్ర‌ద‌ర్శించిన అస‌మాన న‌ట‌న ఈ సినిమాకు లైఫ్‌నిచ్చింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన 'శ్యామ్ సింగ రాయ్'.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తొలివారం ముగిసేస‌రికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 20.80 కోట్ల షేర్ వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా రూ. 14.92 కోట్లు. 

తొలి వారాంతంలో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఈ సినిమా వారం మ‌ధ్య‌లో నిరాశాజ‌న‌క వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిన్న ఏడ‌వ రోజు తెలుగునాట ఈ సినిమాకు వ‌చ్చింది రూ. 31 ల‌క్ష‌లు మాత్ర‌మే. ఇందులో తెలంగాణలో వ‌సూల‌య్యింది రూ. 14 ల‌క్ష‌లు. ఆంధ్ర ఏరియాలో 13 ల‌క్ష‌లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 4 ల‌క్ష‌లు వ‌సూల‌య్యాయి.

తొలి వారంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తెలంగాణ‌లో 'శ్యామ్ సింగ రాయ్' రూ. 7.60 కోట్ల‌ను రాబ‌ట్ట‌గా, ఆంధ్ర‌లో రూ. 5.31 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 2.01 కోట్లను రాబ‌ట్టింది. దేశంలోని మిగ‌తా ప్రాంతాల్లో రూ. 2.50 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో రూ. 3.38 కోట్లు వ‌చ్చాయి. వెర‌సి.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 20.80 కోట్లు వ‌సూల‌య్యాయి. సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రూ. 22 కోట్లు. దీన్ని బ‌ట్టి ఈ వారాంతంలో బ్రేకీవెన్ కావ‌చ్చ‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. జ‌న‌వ‌రి 6లోగా ఎంత క‌లెక్ష‌న్లు వ‌స్తే అంత‌టితో స‌ర్దుకోవాలి. ఎందుకంటే 7న 'ఆర్ఆర్ఆర్' వ‌స్తోంది క‌దా!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com