ENGLISH | TELUGU  

2021 జ్ఞాప‌కాలుః యంగ్ హీరోస్ - మిక్స్డ్ రిజ‌ల్ట్స్!

on Dec 31, 2021

 

2021లో ప‌లువురు యువ క‌థానాయ‌కులు ఎంట‌ర్టైన్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. వీరిలో కొంద‌రు ఇంప్రెస్ చేయ‌గా.. మ‌రికొంద‌రు డిజ‌ప్పాయింట్ చేశారు. ఆ హీరోల వివ‌రాల్లోకి వెళితే..

నాగ‌చైత‌న్యః- ఈ ఏడాది నాగ‌చైత‌న్య ఒకే ఒక సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఆ చిత్ర‌మే.. `ల‌వ్ స్టోరి`. సెన్సిబుల్ పాయింట్ తో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం.. చైతూ కెరీర్ లో మ‌రో మెమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది.

నానిః- ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో నాని రెండు సినిమాలతో సంద‌డి చేశాడు. ఫ్యామిలీ డ్రామా `ట‌క్ జ‌గ‌దీశ్` ఓటీటీలో రిలీజ్ కాగా..  పిరియ‌డ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్` థియేట‌ర్స్ లో రిలీజైంది. వీటిలో ద్విపాత్రాభిన‌యం చేసిన `శ్యామ్ సింగ రాయ్` తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది.

రామ్ః- ఈ సంవ‌త్స‌రం `రెడ్` చిత్రంతో ఎంట‌ర్టైన్ చేశాడు రామ్. మాస్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సినిమా కోసం తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసి మెప్పించాడు.

అఖిల్ః- 2021 అక్కినేని అఖిల్ కి ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది రిలీజైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`తోనే ఫ‌స్ట్ స‌క్సెస్ చూశాడు అఖిల్.

నితిన్ః- `చెక్`, `రంగ్ దే`, `మాస్ట్రో`.. ఇలా ఈ ఏడాది మూడు సినిమాల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు నితిన్. `చెక్`, `రంగ్ దే` థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌గా.. `మాస్ట్రో` ఓటీటీలో వినోదాలు పంచింది. అయితే, ఈ మూడు సినిమాలు కూడా నితిన్ కి విజ‌యాన్ని ఇవ్వ‌లేక‌పోయాయి.

శ‌ర్వానంద్ః- ఈ ఏడాది కూడా శ‌ర్వానంద్ కి విజ‌యాలు ద‌క్క‌లేదు. `శ్రీ‌కారం`, `మ‌హా స‌ముద్రం`.. ఇలా శ‌ర్వా నుంచి వ‌చ్చిన రెండు చిత్రాలు కూడా డిజ‌ప్పాయింట్ చేశాయి. ఇక `మ‌హా స‌ముద్రం`లో మ‌రో హీరోగా న‌టించిన సిద్ధార్ధ్ కి కూడా నిరాశ‌నే మిగిలింది.

గోపీచంద్ః- `సీటీమార్`, `ఆర‌డుగుల బుల్లెట్` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన యాక్ష‌న్ హీరో గోపీచంద్ కి.. `సీటీమార్` మంచి ఫ‌లితాన్ని అందించింది.

న‌వీన్ పోలిశెట్టిః- యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టికి ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్.. మోస్ట్ మెమ‌ర‌బుల్ అనే చెప్పాలి. త‌ను క‌థానాయకుడిగా న‌టించిన `జాతిర‌త్నాలు` సెన్సేష‌న‌ల్ హిట్ గా నిలిచింది.

`అల్ల‌రి` న‌రేశ్ః- ఈ ఏడాది `అల్ల‌రి` న‌రేశ్ నుంచి `బంగారు బుల్లోడు`, `నాంది` చిత్రాలు రాగా.. వీటిలో `నాంది` మంచి ఫ‌లితాన్ని అందించింది.

శ్రీ విష్ణుః- `గాలి సంప‌త్`, `రాజ రాజ చోర‌`, `అర్జున ఫ‌ల్గుణ‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన శ్రీ‌విష్ణుకి.. `రాజ రాజ చోర‌` రూపంలో మంచి విజ‌యం ద‌క్కింది.

స‌త్య‌దేవ్ః- టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ ఈ సంవ‌త్స‌రం.. `పిట్ట‌క‌థ‌లు` (ఆంథాల‌జీ), `తిమ్మ‌రుసు`, `స్కైలాబ్` తో ప‌ల‌క‌రించాడు. వీటిలో `తిమ్మ‌రుసు` డీసెంట్ హిట్ గా నిలిచింది.

వీరితో పాటు రానా (అరణ్య‌), సాయితేజ్ (రిప‌బ్లిక్), బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ (అల్లుడు అదుర్స్), సుధీర్ బాబు (శ్రీ‌దేవి సోడా సెంట‌ర్), సుమంత్ (క‌ప‌ట‌ధారి), సుశాంత్ (ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు), సందీప్ కిష‌న్ (ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజ‌నంబు, గ‌ల్లీ రౌడీ), కార్తికేయ (చావు క‌బురు చ‌ల్ల‌గా, రాజా విక్ర‌మార్క‌), ఆనంద్ దేవ‌ర‌కొండ (పుష్ప‌క విమానం),  నాగ‌శౌర్య (వ‌రుడు కావ‌లెను, ల‌క్ష్య‌), విశ్వ‌క్ సేన్ (పాగ‌ల్), సంతోష్ శోభ‌న్ (ఏక్ మినీ క‌థ‌, మంచి రోజులు వ‌చ్చాయి), శివ కందుకూరి (గ‌మ‌నం), సుమంత్ అశ్విన్ (ఇదే మా క‌థ‌), ఆది (శ‌శి), రాజ్ త‌రుణ్ (ప‌వ‌ర్ ప్లే, అనుభ‌వించు రాజా) వంటి యువ‌ క‌థానాయ‌కులు కూడా ఈ ఏడాదిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. వీరిలో కొంద‌రు జ‌స్ట్ ఓకే అనిపించుకున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.