2021 జ్ఞాపకాలుః అదే నాయిక - అదే దర్శకుడు!
on Dec 31, 2021

2021లో కొన్ని కాంబినేషన్స్ (హీరోయిన్ - డైరెక్టర్) మరోసారి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాయి. `అదే నాయిక - అదే దర్శకుడు` విభాగంలో ఈ ఏడాది అలరించిన ఆ కాంబోస్ వివరాల్లోకి వెళితే..
ప్రగ్య - బోయపాటిః-
స్టార్ కెప్టెన్ బోయపాటి శ్రీను నాలుగేళ్ళ క్రితం రూపొందించిన `జయ జానకి నాయక`లో ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చింది ప్రగ్యా జైశ్వాల్. కట్ చేస్తే.. ఈ ఏడాది `అఖండ`తో మరోసారి ఈ కాంబినేషన్ ఆకట్టుకుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్య పూర్తిస్థాయి నాయికగా కనువిందు చేసింది. ఈ యేటి మేటి విజయాల్లో ఒకటిగా `అఖండ` నిలిచింది.
శ్రుతి హాసన్ - గోపీచంద్ మలినేనిః-
`బలుపు`తో 2013లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న చెన్నై పొన్ను శ్రుతి హాసన్ - టాలెంటెడ్ కెప్టెన్ గోపీచంద్ మలినేని.. ఈ సంవత్సరం `క్రాక్` కోసం మరోసారి జట్టుకట్టారు. సంక్రాంతి సెన్సేషన్ గా నిలిచిన ఈ సినిమాతో తమ కాంబోలో ఓ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు శ్రుతి - గోపీ.
సమంత - సుకుమార్ః-
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన `రంగస్థలం`లో డీ-గ్లామర్ రోల్ లో ఇంప్రెస్ చేసింది సమంత. కట్ చేస్తే.. ఈ క్యాలెండర్ ఇయర్ చివరలో సుక్కు తెరకిక్కించిన `పుష్ప - ద రైజ్` కోసం ``ఊ అంటావా మామా`` పాటలో తళుక్కున మెరిసింది సామ్.
తమన్నా - సంపత్ నందిః-
యంగ్ డైరెక్టర్ సంపత్ నందికి అచ్చొచ్చిన నాయిక.. తమన్నా. `రచ్చ`, `బెంగాల్ టైగర్` వంటి విజయవంతమైన చిత్రాల అనంతరం వీరి కలయికలో వచ్చిన `సీటీమార్`.. 2021 సెప్టెంబర్ లో రిలీజై హిట్ లిస్ట్ లో చేరింది.
శ్రుతి హాసన్ - వేణు శ్రీరామ్ః-
దర్శకుడు వేణు శ్రీరామ్ తొలి చిత్రం `ఓ మై ఫ్రెండ్`లో మెయిన్ లీడ్ గా దర్శనమిచ్చింది శ్రుతి హాసన్. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందివ్వకపోయినా.. పదేళ్ళ తరువాత `వకీల్ సాబ్` కోసం మరోసారి కలిసి పనిచేశారు శ్రుతి, వేణు. ఈ సారి సాలిడ్ హిట్ చూసింది ఈ కాంబో.
మెహ్రీన్ - మారుతిః-
మారుతి రూపొందించిన `మహానుభావుడు`తో ఓ మెమరబుల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది మెహ్రీన్. కట్ చేస్తే.. ఈ ఏడాది `మంచి రోజులు వచ్చాయి` అంటూ మరోసారి మెహ్రీన్ - మారుతి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు.
రకుల్ - క్రిష్ః-
వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ తెరకెక్కించిన `ఎన్టీఆర్ కథానాయకుడు`లో శ్రీదేవిగా ప్రత్యేక పాత్రలో కనిపించింది రకుల్. రెండేళ్ళ తరువాత అదే దర్శకుడితో రకుల్ జట్టుకట్టిన `కొండ పొలం` విమర్శకుల ప్రశంసలు పొందింది.
నివేదా - కిశోర్ తిరుమలః-
కిశోర్ తిరుమల కాంబినేషన్ లో రెండేళ్ళ క్రితం `చిత్రలహరి` చేసింది టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్. ఇక ఈ ఏడాది `రెడ్` కోసం మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేశారు. ఈ రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్స్ గా నిలిచాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



