గోపీచంద్ ‘లక్ష్యం’కి 15 ఏళ్ళు!
on Jul 5, 2022
మ్యాచో స్టార్ గోపీచంద్ ని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రాల్లో ‘లక్ష్యం’ ఒకటి. అనుష్క కథానాయికగా నటించిన ఈ సినిమాతోనే దర్శకుడు శ్రీవాస్ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. జగపతిబాబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో కళ్యాణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ‘ఆహుతి’ ప్రసాద్, చలపతిరావు, రవిబాబు, రఘుబాబు, దేవరాజ్, అమిత్ తివారి, యశ్‌పాల్ శర్మ, ప్రగతి, ఆశిష్ విద్యార్ధి, ధర్మవరపు సుబ్రమణ్యం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సినిమాని నిర్మించారు.
“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `లక్ష్యం`కి ప్రధాన బలంగా నిలిచాయి.
“చక్కెరకేళి”, “సుక్కు సుక్కు”, “గుళ్ళో దేవుడు”, “ఎవడు ఎవడు”, “నిలువవే వాలుకనుల దానా”(రీమిక్స్).. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. `తృతీయ ఉత్తమ చిత్రం`, `ఉత్తమ సహాయక నటుడు` (జగపతిబాబు) విభాగాల్లో `నంది` పురస్కారాలను, `ఉత్తమ సహాయక నటుడు` (జగపతిబాబు) విభాగంలో ఫిల్మ్ ఫేర్‌ని సొంతం చేసుకున్న `లక్ష్యం`.. తమిళంలో ‘మాంజవేలు’ పేరుతోనూ, బెంగాలీలో ‘ఫైటర్’ టైటిల్ తోనూ, కన్నడంలో ‘వరదనాయక’ గానూ రీమేక్ అయింది. కాగా, 2007 జూలై 5న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘లక్ష్యం’... నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
