Home

»

Latest News

'భోళా శంక‌ర్‌'లో చిరుతో క‌లిసి డాన్స్ చేస్తున్న‌ట్లు రివీల్ చేసిన త‌మ‌న్నా!

Jul 5, 2022 6:08PM

 

టాలీవుడ్‌లోని మోస్ట్ పాపుల‌ర్ యాక్ట్రెస్‌ల‌లో త‌మ‌న్నా ఒక‌రు. చ‌క్క‌ని న‌టిగా ఎంత‌టి పేరు తెచ్చుకుందో, త‌న డాన్స్ మూవ్‌మెంట్స్‌తోనూ అంత‌గా పేరు తెచ్చుకుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, రామ్ లాంటి మంచి డాన్సింగ్ హీరోల‌తో వారికి ధీటుగా డాన్సులు వేసి అల‌రించిన తార ఆమె. సింగ్ జ‌రా, డాంగ్ డాంగ్‌, కొడ్తే లాంటి ఐట‌మ్ సాంగ్స్‌తోనూ ప్రేక్ష‌కుల్ని ఆమె రంజింప‌జేసింది. 'సైరా.. న‌ర‌సింహారెడ్డి' చిత్రంలో తొలిసారి చిరంజీవి జోడిగా న‌టించిన‌ప్ప‌టికీ, ఆయ‌న‌తో క‌లిసి డాన్స్ చేసే అవ‌కాశం ఆమెకు రాలేదు.

టాలీవుడ్‌లో డాన్సుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన మెగాస్టార్‌తో మ‌రోసారి ఆమె జ‌ట్టు క‌డుతోంది. ఆ సినిమా.. మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేస్తోన్న 'భోళా శంక‌ర్‌'. ఈ సినిమాలోనైనా చిరుతో ఆమె డాన్స్ చేసే అవ‌కాశంముందా? ఉంద‌నేది స్వ‌యంగా ఆమె నుంచి వ‌చ్చిన జ‌వాబు. అవును. ట్విట్ట‌ర్‌లో ఫ్యాన్స్‌తో ఇంట‌రాక్ట్ అయిన సంద‌ర్భంలో, ఓ అభిమాని 'భోళా శంక‌ర్‌'లో బాస్ చిరంజీవితో డాన్స్ నంబ‌ర్‌ని ఆశించివ‌చ్చా? అని ప్ర‌శ్నించాడు. దానికి "మీరు డిజ‌ప్పాయింట్ కార‌ని నేను ప్రామిస్ చేస్తున్నాను" అనేది ఆమె చెప్పిన జ‌వాబు. చిరంజీవి, త‌మ‌న్నా.. ఇద్ద‌రూ మంచి డాన్స‌ర్స్ కాబ‌ట్టి క‌చ్చితంగా ఆ ఇద్ద‌రి మీద వ‌చ్చే పాట విజువ‌ల్ ట్రీట్‌గా ఉంటుంద‌ని చెప్పొచ్చు.

ఇప్ప‌టిదాకా ఆమె చేసిన క్యారెక్ట‌ర్స్‌లో మోస్ట్ స్పెష‌ల్ ఏద‌ని మ‌రో అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు, "ధ‌ర్మాదురైలో చేసిన సుభాషిణి, 'బాహుబ‌లి'లో చేసిన అవంతిక పాత్ర‌ల్ని నేను నిజంగా ఎంజాయ్ చేశాను అని తెలిపింది. అలాగే, మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఏద‌ని అడిగితే, 'ఎఫ్ 3'లో అబ్బాయిలా న‌టించ‌డం నిజంగా ఛాలెంజింగ్‌గా అనిపించింద‌ని చెప్పింది త‌మ‌న్నా. ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కాంబినేష‌న్‌లో అబ్బాయిలా ఆమె చేసిన న‌ట‌న ఆడియెన్స్‌ను బాగా అల‌రించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com