కమల్ హాసన్ కి కొడుకే శత్రువునా!
on May 17, 2025
విశ్వకథానాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)గ్రేటెస్ట్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam)కాంబోలో తెరకెక్కిన మూవీ 'థగ్ లైఫ్'(Thug Life).గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీపై కమల్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 5 న పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. శింబు(SImbu) త్రిష(Trisha)అభిరామి, ఐశ్వర్య లేక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తమిళ, తెలుగు భాషలతో సహా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే కమల్, మణిరత్నం ఈ చిత్రం ద్వారా తమ విశ్వరూపాన్ని చూపించబోతున్నారని అర్ధమవుతుంది. కమల్ భిన్నమైన గెటప్ లతో గ్యాంగ్ స్టర్ కి నాయకుడుగా కనిపిస్తున్నాడు. అనాధ అయిన శింబుని కమల్ తన కొడుకుగా చెప్పడం, ఆ తర్వాత ఇద్దరు శత్రువులు మారడం కూడా చూపించడంతో ప్రేక్షకుల్లో మూవీ పై మరింత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పవచ్చు. విజువల్ గాను ఐ ఫీస్ట్ కలిగించనుందని కూడా ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది.
ఏ ఆర్ రెహ్మాన్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో ప్రముఖ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన శ్రేష్ఠ్ మూవీస్ పై రిలీజ్ కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
