డబ్బు పోగొట్టుకున్న విజయ్ సేతుపతి.. వాళ్ళు బాగుంటే చాలు
on Jan 29, 2026

విజయ్ సేతుపతి సంచలన స్పీచ్
ఎందుకు ఇప్పడు చెప్పాడు.
గాంధీ టాక్స్ వెనక ఎవరున్నారు
మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(Vijay Sethupathi)సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం ఈలలు, కేకలు. రెండు దశాబ్దాలుగా ఇదే తంతు. ఇప్పుడు ఆ తంతు తెలుగు ప్రేక్షకులకి కూడా ఒక ఆనవాయితీ గా మారింది. మాస్టర్, ఉప్పెన,విక్రమ్, మహారాజు, సర్ మేడమ్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. అదే ఆనవాయితీ కంటిన్యూ చేయించాలనే లక్ష్యంతో రేపు ' గాంధీ టాక్స్'(Gandhi Talks)అనే వినూత్నమైన టైటిల్ తో కూడిన మూవీతో థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్నాడు.
అగ్ర నటుడు అరవింద్ స్వామి, అదితిరావు హైదరి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ చిత్రం యొక్క స్పెషల్. ప్రమోషన్స్ లో భాగంగా టీం తో కలిసి విజయ్ సేతుపతి వరుస ఇంటర్ వ్యూస్ తో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ జీవితం గురించి చెప్పిన మాటలు నెట్టింట ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.
విజయ్ సేతుపతి మాట్లాడుతు సినిమాల్లోకి రాకముందు ఎన్నో ఉద్యోగాలు చేశాను. వాటిల్లో అకౌంటెంట్ ఒకటి. ఆ జాబ్ చేసేటపుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతం ఎంతో మందికి ఉద్యోగం వచ్చేలా చెయ్యడంతో పాటు ఆరేళ్లుగా ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇప్పించడం కోసం నెలకి లక్షన్నర ఖర్చు చేస్తూ వస్తున్నాను. దుస్తులు పంపిణి కూడా నేను చేసే కార్యాక్రమాల్లో ఒకటి. ఇవన్నీ నేను డబ్బు సంపాదిస్తేనే చేయగలను. ఓన్ ప్రొడక్షన్ లో ఎంతో డబ్బు పోయింది. నేను చేసిన సినిమాలు రిలీజ్ కానీ సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో నా రెమ్యునరేషన్ వదులుకొని రిలీజ్ చేయించాను . నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. ఇవ్వడంలోనే నాకు ఆనందం.ఉందని చెప్పుకొచ్చాడు.
also read: టాప్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ మూవీ! చిరుతో రికార్డు కొట్టినట్లే
ఇక గాంధీ టాక్స్ సైలెంట్ చిత్రం. క్యారెక్టర్స్ పెర్ ఫార్మ్ చేస్తాయి గాని ఎటువంటి డైలాగ్స్ ఉండవు. కమల్ హాసన్, సింగీతం శ్రీనివాస్ ల పుష్పక విమానం తర్వాత గాంధీ టాక్స్ మరో ప్రయోగం అని చెప్పవచ్చు. ఏ ఆర్ రెహ్మాన్(Rehman)మ్యూజిక్ ని అందించగా మరాఠి మేకర్ కిషోర్ పాండురంగ్ బేల్కర్( Kishor Pandurang Belekar)దర్శకత్వంలో జీ స్టూడియో నిర్మించింది. రిలీజ్ కి ముందే కొంత మంది ప్రముఖలకి గాంధీ టాక్స్ ని ప్రదర్శించగా పాజిటీవ్ రెస్పాన్స్ ని అందుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



