Pawan Kalyan: టాప్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ మూవీ!..చిరుతో రికార్డు కొట్టినట్లే
on Jan 29, 2026

-సోషల్ మీడియాలో పవన్ ప్రాజెక్ట్ హంగామా
-అదే నిజమైతే గోల్డెన్ ఛాన్స్
-ప్రస్తుతం ఏం చేస్తున్నారు.
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ కోసం అభిమానులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. అదే విధంగా పవన్ డేట్స్ ఇస్తే చాలనుకునే నిర్మాణ సంస్థల ఎదురుచూపులకి లెక్కే ఉండదు. తమ బ్యానర్ లో పవన్ సినిమా చేస్తున్నాడనే రూమర్ వచ్చినా చాలు సదరు నిర్మాణ సంస్థలు చాలా ఆనందపడుతు ఉంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సురేందర్ రెడ్డి(Surendhar Reddy)దర్శకత్వంలో పవన్ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసాడు.పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి 'జైత్ర రామ మూవీస్'బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.పవన్ కి సంబంధించిన మరో కొత్త సినిమా ప్రకటన రానుందని, ఒక భారీ ప్రొడక్షన్ దగ్గర పవన్ డేట్స్ ఉన్నాయనే న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఆ వివరాలు ఇవే.
యువి క్రియేషన్స్(UV Creations)..ప్రభాస్ హిట్స్ లో ఒకటైన మిర్చి తో సినీ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే అగ్ర ప్రొడక్షన్ కంపెనీ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మెగాస్టార్ తో విశ్వం భర ని నిర్మిస్తుంది యు వి నే. ఇప్పుడు యువి క్రియేషన్స్ దగ్గర పవన్ డేట్స్ ఉన్నాయనే ప్రచారం సినీ సర్కిల్స్ లో జోరుగా జరుగుతుంది. సదరు వార్త నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే పవన్ లిస్ట్ లో సురేందర్ రెడ్డి మూవీ నే ఉంది. ఓజి పార్ట్ 2 ఉన్నా ఇప్పట్లో సెట్స్ కి వెళ్లే అవకాశాలు తక్కువ. దీంతో పవన్ నెక్స్ట్ మూవీ యువి క్రియేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉండచ్చనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించిన సంస్థగా యువి క్రియేషన్స్ రికార్డు కొట్టినట్టే.
Also read: పేరు మార్చుకుంటున్న సమంత!..ఈ పేరు ఎలా ఉందో చెప్తారా
ఇక పవన్ నుంచి సెల్యులాయిడ్ పైకి రాబోతున్నఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి శరవేగంగా మెరుగులు దిద్దుకుంటుంది. హరీష్ శంకర్(Harish shankar)దర్శకత్వంలో పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ రాజీ లేని రీతిలో నిర్మిస్తుండగా,ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



