ధమాకా దర్శకుడి తండ్రి మరణం
on Apr 30, 2024
ఎన్నో వైవిధ్యమైన చిత్రాలని తెలుగుప్రేక్షకులకి అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన.సినిమాల కోసం టీచర్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడంటే సినిమా అంటే ఆయనకి ఎంత ఫ్యాషనో అర్ధం అవుతుంది. తాజాగా ఆయన కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది
త్రినాథరావు నక్కిన తండ్రి పేరు సూర్యారావు. అనారోగ్య కారణాల వల్ల సూర్యారావు గారు నిన్న చనిపోయారు. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు త్రినాధరావు కి తమ సానుభూతుని తెలియచేస్తున్నారు. 2013 లో వచ్చిన ప్రియతమ నేను ఇచట కుశలమా అనే చిత్రం ద్వారా త్రినాథరావు దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేము వయసుకొచ్చాం, నువ్విలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్,హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి చిత్రాలకి దర్శకత్వం వహించాడు.
ముఖ్యంగా నేను లోకల్, ధమాకా చిత్రాలు ఆయనకీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ రెండింటితో స్టార్ డైరెక్టర్ గా కూడా మారాడు. రవితేజ ప్లాప్ ల పరంపరకి ధమాకా నే అడ్డుకట్ట వేసింది. దాంతో పలువురు హీరోలు ,నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లో ఒక మూవీకి కమిట్ అయ్యాడు. రచయితగాను కొన్ని సినిమాలకి వర్క్ చేసాడు. విశాఖపట్నం ఆయన స్వస్థలం
Also Read