పిల్లలని లేటుగా కనాలని అండాన్ని భద్రపరచిన మెహ్రిన్
on Apr 30, 2024
హనీ ఈజ్ ది బెస్ట్ అనే డైలాగ్ తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి మెహ్రిన్ ఫిర్జాద. పాల మీగడ తరగ లాంటి అందం తన సొంతం. నటన కూడా అంతే అందంగా ఉంటుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, ఎఫ్ 2 , ఎఫ్ 3 లాంటి సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేసిన మెహరీన్ టూ డే టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది
వయసులో ఉన్నప్పుడు శరీరంలోని ఆరోగ్యకరమైన అండాలని భద్రపరచుకోవడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. అలా భద్రపరుచుకున్న అండాలతో మన ఇష్టం వచ్చినప్పుడు పిల్లలని కనవచ్చు. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే అండాల శీతలీకరణ. ఇప్పుడు కొంత మంది ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. తాజాగా ఈ కోవలో మెహ్రిన్ కూడా చేరింది. అందులో భాగంగా మై ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ అంటు ఒక వీడియోని ఇనిస్టాగ్రమ్ లో అప్ లోడ్ చేసింది. అందులో మెహ్రిన్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవడం ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా అండాలని ఎలా సేకరిస్తారో ఉంది. సదరు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది
ఈ సందర్బంగా కొన్ని విషయాలని కూడా ఆమె వెల్లడించింది. ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలా వద్దా అని రెండు సంవత్సరాలు ఆలోచించాను. ఆ తర్వాత సమాజం గురించి కాకుండా నా భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలనుకున్నా. హాస్పిటల్ కి వెళ్లిన ప్రతి సారి హార్మోన్ల ఇంజక్షన్ కారణంగా కళ్ళు తిరిగి పడిపోయానని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఆమెకి 2021 లో భవ్య బొష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. అతను హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు. తండ్రి పేరు కుల్దీప్ బిష్ణోయ్. ప్రస్తుతం ఎంఎల్ఏ గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరి పెళ్లి మాత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.