అప్పుడు గుంటూరు కారం.. ఇప్పుడు కింగ్‌డమ్...
on Aug 6, 2025
![]()
భారీ సినిమాలు చేయడమే కాదు.. వాటిని సరైన సమయంలో విడుదల కూడా చేసుకోగలగాలి. అప్పుడే ఆ భారీతనానికి తగ్గ వసూళ్లు వస్తాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కింగ్‌డమ్'. జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 24న 'హరి హర వీరమల్లు' విడుదల కాగా, ఆగస్టు 14న 'వార్ 2', 'కూలీ' విడుదల కానున్నాయి. దీంతో మధ్యలో 'కింగ్‌డమ్'కి రెండు వారాలు తిరుగులేదని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. ఇక 'కింగ్‌డమ్'కి తిరుగేలేదు అనుకుంటున్న సమయంలో 'మహావతార్ నరసింహా' రూపంలో తీవ్ర పోటీ ఎదురైంది. (kingdom)
పెద్దగా అంచనాల్లేకుండా జూలై 25న విడుదలైన డివోషనల్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహా' మౌత్ టాక్ తో రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటోంది. ముఖ్యంగా సెకండ్ వీకెండ్ లో అనూహ్యంగా పుంజుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం.
'మహావతార్ నరసింహా' రూపంలో తీవ్రపోటీ ఎదురైనప్పటికీ.. 'కింగ్‌డమ్' బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. యూఎస్ లో విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.39 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నాలుగు రోజుల్లోనే రూ.82 కోట్ల గ్రాస్ రాబట్టిన కింగ్‌డమ్.. వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. నిజానికి 'మహావతార్ నరసింహా' లేకపోతే.. ఈ వసూళ్ళు ఇంకా ఎక్కువ ఉండేవి అనడంలో సందేహం లేదు.

గతంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన 'గుంటూరు కారం', 'డాకు మహారాజ్' సినిమాలకు కూడా ఈ పరిస్థితి వచ్చింది. 'హనుమాన్' రూపంలో 'గుంటూరు కారం'కి, 'సంక్రాంతికి వస్తున్నాం' రూపంలో 'డాకు మహారాజ్'కి అనుకోని పోటీ ఎదురైనప్పటికీ.. ఆ రెండు సినిమాలు మంచి వసూళ్ళు రాబట్టాయి.
ఇప్పుడు సితార బ్యానర్ నుంచి వచ్చిన మరో మూవీ 'కింగ్‌డమ్' విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ మూవీ కలెక్షన్స్ ను మహావతార్ నరసింహా డివైడ్ చేస్తోంది. అయినప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది కింగ్‌డమ్. ఇంత కాంపిటేషన్ లోనూ అతి తక్కువ టైమ్ లో మేజర్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ముఖ్యం గా విజయ్ కున్న క్రేజ్ కారణంగా తమిళ్, మలయాళంలో ఇప్పటికే ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటరైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



