డేవిడ్ రెడ్డి గా మారబోతున్న మంచు మనోజ్
on Aug 6, 2025

'మంచు మనోజ్'(Manchu Manoj)కొంత కాలం గ్యాప్ తర్వాత గత మే నెలలో 'భైరవం'(Bhairavam)మూవీతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. ఈ మూవీలో 'గజపతి వర్మ' అనే క్యారక్టర్ ని పోషించి, తన నటనలోని గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ప్రస్తుతం 'తేజ సజ్జ' హీరోగా తెరకెక్కుతున్న 'మిరాయ్' లో ప్రతి నాయకుడిగా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో సినిమాపై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి.
రీసెంట్ గా మంచు మనోజ్ కొత్త చిత్రం చిత్రం ప్రారంభమైంది. మనోజ్ కెరీర్ లో 21 వ చిత్రంగా వస్తున్న ఈ మూవీకి మూవీకి 'డేవిడ్ రెడ్డి'(David Reddy)అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతు ఇండస్ట్రీలోకి ప్రవేశించి 21 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళుగా నాపై అభిమానాన్ని చూపిస్తున్న అభిమానులకి, ప్రేక్షకులని ధన్యవాదాలు. డేవిడ్ రెడ్డి హిస్టారికల్ యాక్షన్ ఫిలిం. 1897 ,1922 కాలం నాటి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. యక్కంటి హనుమారెడ్డి(Yakkanti Hanuma Reddy)దర్శకత్వం వహిస్తున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియచేస్తానని చెప్పాడు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి 'తారకరామారావు'(NTR)వన్ మాన్ షో 'మేజర్ చంద్ర కాంత్' చిత్రం ద్వారా మంచు మనోజ్ బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు. 1993 లో వచ్చిన ఆ మూవీ ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు అనేక రికార్డులని కూడా నెలకొల్పింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



