నా మాస్టర్ నుంచి ఎంతో నేర్చుకున్నాను..శ్రష్టి వర్మ అంటే ఇది
on Jun 28, 2025
జానీ మాస్టర్(Jani Master)వద్ద ఎన్నో సినిమాలకి డాన్స్ అసిస్టెంట్ గా పని చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రష్టి వర్మ(Shrasti verma). ఒక మూవీలో హీరోయిన్ గా కూడా చేసి సత్తా చాటిన శ్రష్టి ప్రస్తుతం పలు రకాల చిత్రాలకి సొంతంగా డాన్స్ కంపోజ్ చేస్తుంది. అల్లు అర్జున్(Allu Arjun)రీసెంట్ హిట్ పుష్ప పార్ట్ 2 లోని 'సుసేకి' సాంగ్ కి కొరియోగ్రఫీ ని అందించిన గణేష్ ఆచార్య మాస్టర్ కి అసిస్టెంట్ గా చేసింది.
రీసెంట్ గా శ్రష్టి ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తు 'నాగబంధం' మూవీ నుంచి అందమైన భక్తి గీతాన్నిపూర్తి చేశాం. ప్రతి పదం భక్తితో రూపొందించబడింది. ఈ పాట సంగీతం కంటే ఎక్కువ, ఇది ప్రార్థనలా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. గణేష్ ఆచార్య మాస్టర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్ మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీ మార్గదర్శకత్వం, ఓర్పు నాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. అది మీ ప్రత్యేకమైన బోధనా విధానం అయినా లేదా మీరు పంచుకున్న జ్ఞానం అయినా నాతో ఎప్పుడు ఉంటాయి. మీరు నేర్చించిన పాఠాలెన్నో నాలో విశ్వాసం, క్రమ శిక్షణని పెంచాయంటూ శ్రష్టి వర్మ పోస్ట్ చేసింది. గణేష్ ఆచార్య సుదీర్ఘ కాలంగా భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక హిట్ సాంగ్ కి కొరియో గ్రఫీ ని అందిస్తు వస్తున్నాడు. ఈ క్రమంలోనే నాగ బంధం మూవీకి సంబంధించి గణేష్ మాస్టర్ తో శ్రష్టి వర్మ అసోసియేట్ అయినట్టుగా తెలుస్తోంది.
డెవిల్ మూవీ ఫేమ్ 'అభిషేక్ నామ' స్వీయ దర్శకత్వంలో నాగబంధం'(Nagabandham)తెరకెక్కుతుంది. పురాతన విష్ణు దేవాలయాల రహస్యాలను మరియు ఆ దేవాలయాలలో ఉండే నాగబంధం యొక్క ఆచారాల గురించి ఈ చిత్రం చెప్పబోతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండగా విరాట్ కర్ణ ,నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాశ్, మురళిశర్మ , బిఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
