అవతార్ రేంజ్‌లో శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. గేమ్ ఛేంజర్ అవుతుందా..?
on Jul 12, 2025

ఒకప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ అంటే ఓ బ్రాండ్. అప్పట్లోనే భారీ సినిమాలు తీసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'జెంటిల్ మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి సినిమాలతో సంచలనం సృష్టించాడు. అలాంటి శంకర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయాడు. ముఖ్యంగా గత రెండు చిత్రాలు 'భారతీయుడు 2', 'గేమ్ ఛేంజర్' దారుణంగా నిరాశపరిచాయి. దాంతో ఇక శంకర్ పని అయిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో తాను గ్లోబల్ స్థాయిలో సత్తా చాటే సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తానని ప్రకటించి షాకిచ్చాడు శంకర్.
వేల్పారి అనే ఓ భారీ సినిమాని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్ లో పంచుకున్నాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం వేల్పారి పైనే ఉందని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నానని చెప్పాడు. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో అయితే, ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి అని అన్నాడు. గ్లోబల్ అప్పీల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నానని, ఈ చిత్రం తన కెరీర్ కి గేమ్ ఛేంజర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలోని ప్రతి అంశం గ్రాండ్ గా ఉంటుందని.. గ్లోబల్ స్టాండర్డ్స్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'అవతార్' రేంజ్‌లో భారీ వీఎఫ్‌ఎక్స్‌తో విజువల్ వండర్‌గా వేల్పారి చిత్రాన్ని రూపొందించాలని ఆశ పడుతున్నట్లు శంకర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం శంకర్ తో సినిమా అంటేనే నిర్మాతలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది శంకర్ ఏకంగా 'అవతార్' రేంజ్ సినిమా కోసం కలలు కంటున్నాడు. మరి ఆయన కల నెరవేరి.. వేల్పారితో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



