ముద్దు సన్నివేశం తొలగించినందుకు సెన్సార్ పై శ్రీయ ఆగ్రహం
on Jul 12, 2025

అక్కినేని 'నాగచైతన్య'(Nagachaitanya)ఫస్ట్ మూవీ 'జోష్' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి 'శ్రీయ ధన్వంతరి'(Shreya Dhanwanthary). చైతన్య క్లాస్ మేట్ గా భావన అనే క్యారక్టర్ ద్వారా మంచి గుర్తింపుని పొందిన శ్రీయ, ఆ తర్వాత హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసి 'వై చీట్ ఇండియా, చుప్, అద్భుత్ వంటి పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తు తన సత్తా చాటుతుంది.
నిన్న వరల్డ్ వైడ్ గా 'సూపర్ మాన్'(Superman)మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఇండియా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో విడుదల కాగా, ఇండియా వెర్షన్ కి సంబంధించి హీరో హీరోయిన్ పై తెరకెక్కిన ముప్పై మూడు సెకన్ల నిడివి ఉన్న ముద్దు సన్నివేశాన్ని సెన్సార్ వాళ్ళు తొలగించడం జరిగింది. ఈ విషయం పై శ్రీయ ఇనిస్టా వేదికగా స్పందిస్తు ముద్దు సన్నివేశాన్ని సెన్సార్ వాళ్ళు కట్ చెయ్యడం చాలా విచిత్రంగా ఉంది. ప్రజలు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని వాళ్లే కోరుకుంటారు. కానీ ఇలా ముద్దు సన్నివేశాలు తీసేస్తే ప్రేక్షకులకి థియేటర్ అనుభూతి ఏమి ఉంటుంది. మా డబ్బు ,మా సమయంతో మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. ప్రేక్షకుల్ని చిన్నపిల్లలాగా సెన్సార్ వాళ్ళు భావిస్తున్నారని శ్రీయ ఇనిస్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.
సూపర్ మాన్ తొలిరోజు ఇండియాలో 6 .9 కోట్ల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. డేవిడ్ కోరెన్సవెట్(DavidCorenswet), రాచెల్ బ్రోస్ నహన్(Rachel Brosnahan), నికోలస్ హాల్ట్ కీలక పాత్రలు పోషించగా జేమ్స్ గన్(James Gunn)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



