ENGLISH | TELUGU  

కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా హీరో బయోపిక్ లో ఎన్టీఆర్!

on May 15, 2025

దేవరతో కలుపుకొని మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)నుంచి ఇప్పటి వరకు ముప్పై చిత్రాల దాకా వచ్చాయి. ఈ ముప్పై చిత్రాల ద్వారా ఎన్టీఆర్ ఇమేజ్ అంతకి అంత పెరుగుతు నెంబర్ వన్  హీరోగా నిలబడేలా చేసాయి. పైగా అవన్నీ కూడా రచయిత కలం నుంచి పుట్టిన ఫక్తు కమర్షియల్ కథలు. అంటే ఎన్టీఆర్ ఇప్పటి వరకు నిజ జీవిత కథలు, బయోపిక్ లలో చెయ్యలేదు.

కానీ రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇండియన్ సినిమా పితామహుడు 'దాదాసాహెబ్ ఫాల్కే'(Dadasaheb Phalke)బయోపిక్ లో ఎన్టీఆర్  చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఫాల్కే రోల్ లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజానికి రెండేళ్ల క్రితమే దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో ఫాల్కే జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ తో 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో మూవీ తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. వరుణ్ గుప్తా అనే ప్రొడ్యూసర్ తో కలిసి రాజమౌళి(SSrajamouli)తనయుడు కార్తికేయ నిర్మించబోతున్నాడని, నితిన్ కుక్కర్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ వార్తలు వస్తుండంతో, మరిన్ని అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

1870 వ సంవత్సరం ఏప్రిల్ 30 న మహారాష్ట్రలోని త్రయంబక్ లో 'దాదాసాహెబ్ ఫాల్కే' జన్మించాడు.  ప్రాథమిక విద్య మొత్తం త్రయంబక్ లోనే పూర్తి చేసి, మెట్రిక్యులేషన్ బొంబాయిలో చదివాడు. 1885 లో సర్ జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో చేరి, డ్రాయింగ్‌లో ఒక సంవత్సరం కోర్సు పూర్తి చేశాడు. 1911 లో ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా నడిపిన ఫాల్కే, ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టి 1912 లో 'ఫాల్కే ఫిల్మ్స్ కంపెనీ' ని స్థాపించాడు. 1913 లో, 'రాజా హరిశ్చంద్ర' అనే సినిమాని రూపొందించాడు.ఈ 'రాజా హరిశ్చంద్ర' నే మొట్టమొదటి భారతీయ సినిమా.  పంతొమ్మిదేళ్ళ  కెరీర్‌లో తొంబై ఐదు సినిమాలు, ఇరవై ఏడు షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించాడు. వాటిల్లో ఎక్కువ భాగం రచనా దర్శకత్వంతో నటుడుగాను నటించి తన సత్తా చాటాడు.ఆయన అసలు పేరు  ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. భారతీయ చలనచిత్ర పరిశ్రమకి  ఆయన చేసిన సేవలకు గుర్తుగా, భారత ప్రభుత్వం 1969 నుండి "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు"ని  ప్రారంభించింది. మరి ఇన్ని పార్శ్యాలు ఉన్న  దాదాసాహెబ్ ఫాల్కే క్యారక్టర్ ని ఎన్టీఆర్ చేయడం ఖాయమైతే ఇండియన్ సినిమా హిస్టరీ లో సరికొత్త రికార్డులు నమోదయినట్టే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో వార్  2(War 2),ప్రశాంత్ నీల్ మూవీ, దేవర 2 ఉన్నాయి.     

 

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.