ఆ సినిమాని బ్యాన్ చెయ్యాలంటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన
on May 14, 2025

సంతానం(Santhanam)గీతిక తివారీ, సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం డెవిల్స్ డబుల్స్ నెక్స్ట్ లెవెల్(dd next level). కామెడీ హర్రర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించగా ది షో పీపుల్, నీహారిక ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. మే 16 న విడుదల కాబోతుంది.
ఇక ఈ మూవీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నిత్యం పాడుకునే పరమ పవిత్రమైన శ్రీ తిరుమల తిరుపతి(Tirumala Tirupati)ఏడుకొండల వాడి గోవిందనామాలని రాప్ సాంగ్ గా చిత్రీకరించడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఉంది. దీంతో ఈ సాంగ్ పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానులతో పాటు జనసేన(Janasena)నాయకులు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తు 'హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వాడి నామాలని క్లబ్ పాటగా చూపించి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు. తక్షణమే ఈ సినిమాని తమిళనాడులో బ్యాన్ చెయ్యాలి, లేదా సినిమాలో ఆ పాటనైనా తొలగించాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళనాడు(Thamilanadu)లో కూడా హిందువులు గత కొన్ని రోజులుగా సదరు సాంగ్ ని తొలగించాలనే డిమాండ్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



