ఆది సీక్వెల్ కి ఆ హీరో, ఆ దర్శకుడు ఓకేనా!
on Feb 9, 2026

-సోషల్ మీడియాలో ఆది సీక్వెల్ హంగామా
-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు
-సీక్వెల్ లో ఎవరు ఉండాలి
-ఆ హీరో అయితే మీకు ఓకే నా!
రెండున్నర దశాబ్దాల క్రితం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విస్ఫోటనం సంభవించింది. సదరు విస్ఫోటనం దెబ్బకి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ స్వచ్ఛందంగా సైడ్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని కల్పించిన చిత్రం 'ఆది'(Aadi).ఈ ఒకే ఒక్క మూవీ ఎన్టీఆర్(Ntr)ని ఓవర్ నైట్ తెలుగు సినిమా సింహాసనంపై కూడా కూర్చోపెట్టింది. ఇప్పటికి అభిమానుల్లో, మూవీ లవర్స్ లో ఆది తాలూకు కథనం, డైలాగ్స్, ఎన్టీఆర్ పెర్ ఫార్ మెన్స్, వినాయక్(VV Vinayak)టేకింగ్ యొక్క జ్ఞాపకాలు సలసల మరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. దీంతో అభిమానుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయింది. ఆ డీటెయిల్స్ ఏంటో పూర్తిగా చూద్దాం.
ఆది కి సీక్వెల్ తెరకెక్కితే ఎలా ఉంటుంది? ఎలా ఉండటం ఏంటి సూపర్ గా ఉంటుంది. అనుకుంటున్నారు కదు.. అవును సూపర్ గా ఉంటుంది. మళ్ళీ సిల్వర్ స్క్రీన్ షేక్ చెయ్యడానికి ఆది కి సీక్వెల్ తెరకెక్కబోతుందనే న్యూస్ ఒక రేంజ్ లోనే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ప్రస్తుతం వినాయక్ ఆది సీక్వెల్ కథలో నిమగ్నమయ్యి ఉన్నాడని, త్వరలోనే ఎన్టీఆర్ కి కథ వినిపించబోతున్నాడనే రూమర్స్ సైతం భారీ బందోబస్తుతోనే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఫస్ట్ టైం రూమర్ ని గౌరవిస్తున్నాం. ఆది లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ వస్తే ఆ కిక్కే వేరు. ఎప్పట్నుంచో సదరు కోరిక మా మనసులలో అగ్ర తాంబూలాన్ని అందిపుచ్చుకుంది.
Also read: Toxic: టాక్సిక్ తెలుగు బిజినెస్ పరిస్థితి ఇదే.. దిల్ రాజు కట్టిన అమౌంట్ వైరల్
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ కెరీర్ లోనే పాన్ ఇండియా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీ, దేవర 2 లాంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి.కాకపోతే ఈ రెండు చిత్రాలు ఇంకా అధికారకంగా అనౌన్స్ చెయ్యలేదు. సదరు చిత్రాలు చెయ్యడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఆది 2 లాంటి లోకల్ ఊర మాస్ సినిమా చేసి ఎన్టీఆర్ మమ్మల్ని అలరించాలని కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక ఫలించి ఆది 2 తెరకెక్కుతుందేమో చూడాలి. ఏది ఏమైనా అంతిమ నిర్ణయం ఎన్టీఆర్ దే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



