నరేష్-పవిత్ర 'మళ్లీ పెళ్లి'కి ఊహించని షాక్!
on May 25, 2023
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మళ్లీ పెళ్లి'. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా రేపు(మే 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు కొద్ది గంటల ముందు ఈ మూవీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కోర్టుని ఆశ్రయించారు.
'మళ్లీ పెళ్లి' సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడే ఇది నరేష్-పవిత్ర ల బయోపిక్ లా ఉందనే కామెంట్స్ వినిపించాయి. నరేష్-పవిత్ర ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం, వారిద్దరూ ఓ హోటల్ లో ఉండగా రమ్య అక్కడకు వెళ్లి గొడవ చేయడం వంటి సన్నివేశాలతో పాటు టీజర్, ట్రైలర్ లో కృష్ణ, విజయనిర్మల రిఫరెన్స్ లు కూడా కనిపించాయి. ఈ సినిమా ప్రధానంగా నరేష్, పవిత్ర, రమ్య నిజజీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని ట్రైలర్ తో దాదాపు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రమ్య హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ సినిమాను చిత్రీకరించారని, కావున విడుదలను ఆపాలంటూ ఆమె పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
