మహేష్ ఖలేజా.. రీ రిలీజ్ లో బాక్సాఫీస్ ఊచకోత!
on May 25, 2025
థియేటర్లలో సరైన ఆదరణకు నోచుకోకుండా ఆ తర్వాత కాలంలో కల్ట్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటిలో 'ఖలేజా' ముందు వరుసలో ఉంటుంది. 'అతడు' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రమిది. 2010 లో విడుదలైన ఖలేజా.. థియేటర్లలో పరాజయం పాలైంది. కానీ ఆ తర్వాత టీవీలలో చూసిన ఆడియన్స్ ఇంత మంచి సినిమాని ఎలా ఫ్లాప్ చేశామని రియలైజ్ అయ్యారు. ఖలేజాని అభిమానించే వారు పెరుగుతూ పోవడంతో ఈ సినిమాకి కల్ట్ స్టేటస్ వచ్చింది. ఎందరో ఈ మూవీని రిపీటెడ్ గా చూస్తుంటారు. ఇప్పుడు ఖలేజా సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. (Khaleja Re Release)
మే 30న ఖలేజా రీ రిలీజ్ అవుతోంది. రిలీజ్ టైంలో ఫ్లాప్ చేసిన ఆడియన్స్.. ఈసారి ఆ తప్పు చేయకూడదు అనుకుంటున్నారు. అందుకే బుకింగ్స్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ఇంకా ఐదు రోజులు సమయం ఉండగా.. అప్పుడే లక్షన్నరకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. రీ రిలీజ్ ల పరంగా 'ఖలేజా' సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.2 కోట్లు సాధించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. రీ రిలీజ్ లో రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి తెలుగు సినిమాగా ఖలేజా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాల కంటే కూడా.. థియేటర్లలో ఖలేజాను ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఖలేజా రీ రిలీజ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
